iDreamPost
android-app
ios-app

Gaami Movie: గామి బడ్జెట్ ఓన్లీ 6 కోట్లా?

విశ్వక్‌ సేన్‌ నటించిన గామి సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. గామి బడ్జెట్‌ తెలిస్తే షాకవుతారు. ఆ వివరాలు..

విశ్వక్‌ సేన్‌ నటించిన గామి సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. గామి బడ్జెట్‌ తెలిస్తే షాకవుతారు. ఆ వివరాలు..

Gaami Movie: గామి బడ్జెట్ ఓన్లీ 6 కోట్లా?

కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఊరికే లోకేషన్స్ అనీ, స్పెషల్ ఎఫెక్ట్స్ అనీ, గ్రాఫిక్స్ అనీ నిర్మాతల జేబులకి చిల్లులు పెట్టేసే దర్శకగణం చూసి నేర్చుకోవాల్సిన పాఠం గామి చిత్రం. ఈ మధ్య పాన్ ఇండియా పిచ్చి ఒకటి తెలుగు సినిమాని పట్టి పీడిస్తోంది. పానిండియా కోసం ప్రాకులాడుతూ అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళ సైన్యాన్ని పోషించమని నిర్మాతలను బలి పశువులను చేసేసే ట్రెండ్ కూడా జడలు విప్పి, జూలు విదిలిస్తోంది.

ఇటువంటి పరిస్థితులలో గామి చిత్రం అందరినీ షాక్ కి గురిచేసింది. అంత గొప్ప విజువల్స్, అంత గొప్పగొప్ప లొకేషన్స్, కథ ఇంపాక్ట్ ని తెరమీద కోటిరెట్లు పెంచే వర్క్….ఇవన్నీ చూస్తే గామికి ఎంత పెద్ద బడ్జెట్టు అయిఉంటుందోననే డౌట్ రాకమానదు. ఎంతైనా సమంజసమేనని సమాధానపరుచుకునే స్థాయిలోనే సినిమా ఉండడం, తర్వాతి టాక్, కలెక్షన్లు చూస్తుంటే అందరూ అవాక్కయ్యారు.

gaami movie budget 6 crores

ఇంతకీ గామి సినిమాకి వాళ్ళు పెట్టిన ఖర్చు మొత్తం తెలిస్తే మరింత షాక్ అవుతారు. కేవలం ఆరు కోట్లేనట. చిత్ర యూనిట్ కి సంబంధించిన అతిముఖ్యమైన వ్యక్తి ఈ విషయాన్ని ఐ డ్రీమ్ తో పంచుకున్నారు. విస్మయం కలిగింది. కేవలం ఆరంటే ఆరే కోట్లతో చేశారా? వాటే గ్రేట్ ధింగ్. నిజంగా సాధ్యమైందా అంత కంట్రోల్డ్ బడ్జెట్ లో చేయడం? ఇవన్నీ సమాధానాలు దొరకని ప్రశ్నలే అయినప్పటికీ కూడా, ఇటువంటి అసాధ్యమైన విషయాన్ని దర్శకుడు విద్యాధర్, హీరో విష్వక్సేన్ సంయుక్తంగా సాధ్యం చేసి చూపించారు.

షూ స్ట్రింగ్‌  బడ్జెట్ అంటారు సినిమా పరిభాషలో. అదే ఇది. అంటే అనవసరమైన హెచ్చులకు పోకుండా, సినిమానే ప్రాణంగా భావించి, అవుట్ పుట్ నే ఆరాధిస్తే గామి లాటి సినిమాలొస్తాయి. పైగా క్రౌడ్ ఫండింగ్ మీద చేసిన సినిమా ఇది. ఇటువంటి సినిమాలను నిర్మించే నాథుడు కూడా అప్పుడప్పుడు కరువవుతాడు. నమ్మరు. పైగా, విష్వక్సేన్ అన్నిటిలోనూ దూరుతాడని, అన్నిట్లో వేలు పెడతాడనే టాక్ కూడా సినిమా ఇండస్ట్రీలో పేరుకుపోయి ఉంది. కానీ, వేలు పెట్టినా, చేతులు పెట్టినా విష్వక్సేన్ క్వాలిటీ కోసం ఆరాటపడతాడు, తనదైన అవగాహనను చొప్పించడానికి తెగపాటుపడతాడనే నిజం సన్నిహితులైన కొందరికే తెలుస్తుంది. పైగా ఆ మధ్య సీనియర్ హీరో అర్జున్ సినిమాని కూడా ఇబ్బంది పెట్టాడని అర్జునే నేరుగా ప్రెస్ మీట్ పెట్టి మరీ గొల్లుమన్నాడు.

గామి లాంటి సినిమాలు వచ్చినప్పడు, దాని వెనుక దాగి ఉన్న నిజానిజాలు వెలుగులోకి వచ్చినప్పుడు విష్వక్సేన్ పట్ల గౌరవభావమే కలుగుతుంది తప్ప మరో ఆలోచన రానేరాదు. బారహ్ ఖూన్ మాఫీ అంటారు. విష్వక్సేనే గనక పూనుకోకపోయిఉంటే, ఈ పాట్లు ఎవడు పడతాడ్రా బాబూ అనుకుని ఉంటే.. గామి అసలు ప్రారంభమయ్యే ఉండేది కాదు. తెలుగు సినిమాకి ఇంత మంచి ట్విస్టు కూడా లభించేది కాదు.