iDreamPost
android-app
ios-app

వీడియో: బిగ్ బాస్ ఎంట్రీని దాదాపు కన్ఫామ్ చేసిన విష్ణు ప్రియ- రీతూ చౌదరి

  • Published Aug 01, 2024 | 7:17 PM Updated Updated Aug 01, 2024 | 7:17 PM

Vishnupriya- Rithu Chowdary On Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి చాలానే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే కంటెస్టెంట్స్ కి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. కానీ, యాంకర్ విష్ణు ప్రియ, రీతూ చౌదరి మాత్రం ప్రేక్షకులు దీవిస్తే తాము బిగ్ బాస్ హౌస్ కి వెళ్తాం అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Vishnupriya- Rithu Chowdary On Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి చాలానే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే కంటెస్టెంట్స్ కి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. కానీ, యాంకర్ విష్ణు ప్రియ, రీతూ చౌదరి మాత్రం ప్రేక్షకులు దీవిస్తే తాము బిగ్ బాస్ హౌస్ కి వెళ్తాం అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

  • Published Aug 01, 2024 | 7:17 PMUpdated Aug 01, 2024 | 7:17 PM
వీడియో: బిగ్ బాస్ ఎంట్రీని దాదాపు కన్ఫామ్ చేసిన విష్ణు ప్రియ- రీతూ చౌదరి

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ షోకి మంచి ఆదరణ పెరిగింది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 7 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 8వ సీజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈసారి చాలానే మార్పులు, కొత్త కొత్త రూల్స్ ఉంటాయి అని టాక్ నడుస్తోంది. షోకి సంబంధించి అధికారికంగా లోగో లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది అంటూ భరోసా కలిగించారు. దానికి తగినట్లుగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే చాలా పేర్లు కంటెస్టెంట్స్ లిస్ట్ లో వైరల్ అవుతున్నాయి. వాటిలోకి ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చేరబోతున్నారు అంటున్నారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి వచ్చే కంటెస్టెంట్స్ అంటూ చాలానే పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో కొన్నిపేర్లు అయితే తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో జోష్ నింపేస్తున్నాయి. ముఖ్యంగా నరేశ్ లొల్ల, అక్షిత, ప్రేరణ వంటి సీరియల్ ఆర్టిస్టులు కన్ఫామ్ అయిపోయారు అంటున్నారు. అలాగే అమర్ దీప్ భార్య తేజశ్వినీని కూడా సంప్రదిస్తున్నారు అంటున్నారు. అలాగే మొగలి రేకులకు సంబంధించి ఇంద్రనీల్ దాదాపుగా ఖాయం అయ్యాడు అంటున్నారు. ఇంక సీరియల్ ఆర్టిస్ట్ హారికను కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యింది అని వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్ సనా కూడా బిగ్ బాస్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఇంకో రెండు పేర్లు చేరాయి. వాళ్లే యాంకర్స్ విష్ణు ప్రియ, రీతూ చౌదరి.

బిగ్ బాస్ లోకి:

తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన బైట్ లో విష్ణు ప్రియ, రీతూ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ సీజన్ రాబోతోంది వెళ్లబోతున్నారా? అని అడగ్గా.. విష్ణు ప్రియ చాలా తెలివిగా సమాధానం చెప్పుకొచ్చింది. తనకు స్వతహాగా బిగ్ బాస్ లోకి వెళ్లే ఉద్దేశం లేదు అని చెప్పుకొచ్చింది. అయితే తనని బిగ్ బాస్ లో చూడాలి అని చాలా మది అనుకుంటున్నారు అంటూ కామెంట్ చేసింది. అలాగే తనకు బిగ్ బాస్ కి వెళ్లాలి అని ఎందుకు ఉంది అంటే తాజాగా పెరిగిన 10 కిలోల బరువు తగ్గించుకోవచ్చు అని ఉందంట.

ఈ కామెంట్స్ అన్నీ చూస్తే తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నాను అని చెప్పింది. అలాగే అవకాశం వస్తే.. ప్రేక్షకుల ఆశీస్సులు ఉంటే తప్పకుండా బిగ్ బాస్ లో కనిపిస్తాను అని చెప్పుకొచ్చింది. అలాగే రీతూ చౌదరి కూడా విష్ణు ప్రియ కామెంట్స్ కాపీ పేస్ట్ అంటూ చెప్పింది. అంటే తనకి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలి అనే ఉందని చెప్పింది. మరి.. విష్ణు ప్రియ- రీతూ చౌదరి బిగ్ బాస్ కి వెళ్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetpasacasinocasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabethızlıcasino girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom