iDreamPost
android-app
ios-app

మార్క్ ఆంటోని.. విశాల్ నుండి అసలు ఎక్స్ పెక్ట్ చేయలేదు బ్రో!

  • Author ajaykrishna Updated - 04:45 PM, Mon - 4 September 23
  • Author ajaykrishna Updated - 04:45 PM, Mon - 4 September 23
మార్క్ ఆంటోని.. విశాల్ నుండి అసలు ఎక్స్ పెక్ట్ చేయలేదు బ్రో!

కొన్నిసార్లు రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తుంటారు హీరోలు. అవి వర్కౌట్ అవుతాయా లేదా అనేది పక్కన పెడితే.. వెరైటీ జానర్స్ లో సినిమాలు చేస్తున్నారని ప్రేక్షకులలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. హీరో విశాల్ విషయంలో ఇటు తెలుగు, తమిళ ఆడియన్స్ లో అలాంటి అభిప్రాయమే ఉందని చెప్పవచ్చు. యాక్షన్ జానర్ లో విశాల్ కి మంచి పేరుంది. డిఫరెంట్ స్టోరీస్ తో కొన్నేళ్లుగా యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కొన్ని సినిమాలు వర్కౌట్ అయినా.. విశాల్ నుండి కొత్తదనం కోరుకుంటున్నారు ఫ్యాన్స్. తాజాగా మార్క్ ఆంటోనీ అనే గ్యాంగ్ స్టర్ కామెడీ, సైన్స్ ఫిక్షన్ మూవీ చేశాడు.

సెప్టెంబర్ 15న తమిళ, తెలుగు భాషలలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అధిక్ రవిచంద్రన్ రూపొందించిన ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కథను రివీల్ చేయకుండా చాలా కొత్తగా ట్రైలర్ ని కట్ చేశారు. గ్యాంగ్ స్టర్ యాక్షన్ తో పాటు ఇందులో టైమ్ ట్రావెలింగ్ టాపిక్ కూడా ఉండటం విశేషం. ఫస్ట్ టైమ్ విశాల్ ని చాలా వేరియేషన్స్ లో ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. ఇన్నాళ్లు ఒకే రకమైన యాక్షన్ సినిమాలతో అలరించిన విశాల్.. మొదటిసారి కామెడీతో పాటు చాలా రకాల వేరియేషన్స్ చూపించేసాడు. అయితే ట్రైలర్ లో కథను మాత్రం ఎక్కడా లీక్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు.

విశాల్ తో పాటు ఎస్.జే. సూర్య ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ చేశాడు. పాత్రలను కూడా ట్రైలర్‌లో చూపించడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే.. ట్రైలర్ లో అన్ని పాత్రలను ఇంటరెస్టింగ్ గా చూపిస్తూ.. చిన్నపాటి సాటిస్ఫాక్షన్ ఆడియన్స్ కి కలిగించారని చెప్పాలి. ట్రైలర్ చూసుకుంటే.. ఒక ఫోన్ ద్వారా టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో సినిమా రూపొందినట్లు అర్ధమవుతుంది. విశాల్ నుండి ఫ్యాన్స్ కోరుకొనే అంశాలన్నీ చూపిస్తూనే.. డ్యూయెల్ రోల్ లో ప్రెజెంట్ చేశారు. ఎస్‌జే సూర్య పాత్ర కూడా భిన్నమైన వేషధారణతో.. 90స్ బ్యాక్ డ్రాప్ ని తలపించింది. ట్రైలర్ చూశాక ఇన్ని వేరియేషన్స్ ఏంటని.. సర్ప్రైజ్ అవుతున్నారు ఫ్యాన్స్. రీతూ వర్మ హీరోయిన్ కాగా.. జీవీ ప్రకాష్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మరి మార్క్ ఆంటోని ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet