iDreamPost
android-app
ios-app

Vishal: అమ్మాయితో రోడ్డుపై విశాల్‌ చక్కర్లు.. లాస్ట్‌లో అసలు ట్విస్ట్‌!

  • Published Dec 27, 2023 | 11:47 AM Updated Updated Dec 27, 2023 | 11:47 AM

విశాల్‌ ప్రేమ, పెళ్లి వ్యవహారాలపై గత కొన్నేళ్ల నుంచి పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. తాజాగా, విశాల్‌ ఓ యువతితో రోడ్డుపై తిరుగుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

విశాల్‌ ప్రేమ, పెళ్లి వ్యవహారాలపై గత కొన్నేళ్ల నుంచి పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. తాజాగా, విశాల్‌ ఓ యువతితో రోడ్డుపై తిరుగుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

  • Published Dec 27, 2023 | 11:47 AMUpdated Dec 27, 2023 | 11:47 AM
Vishal: అమ్మాయితో రోడ్డుపై విశాల్‌ చక్కర్లు.. లాస్ట్‌లో అసలు ట్విస్ట్‌!

విశాల్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు అసలు పరిచయమే అక్కర్లేదు. తెలుగు వాడే అయినా.. తమిళంలో స్టార్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తమిళంలో తీసే సినిమాలు తెలుగులో డబ్‌ అయి విజయాన్ని అందుకుంటూ ఉన్నాయి. సూపర్‌ హిట్లుగా కూడా నిలుస్తున్నాయి. సినిమా జీవితంలో సూపర్‌ సక్సెస్‌ సాధించిన ఆయన.. వ్యక్తిగత జీవితంలో మాత్రం కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. పెళ్లి విషయంలో గత కొన్నేళ్ల నుంచి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి.

 విశాల్‌ ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌తో ప్రేమ వ్యవహారం నడిపారు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. అయితే, వరలక్ష్మి కుటుంబం ఈ పెళ్లికి నిరాకరించింది. దీంతో విశాల్‌ -వరలక్ష్మిల ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లకుండానే  మధ్యలోనే ఆగిపోయింది. కొన్నేళ్ల తర్వాత ఆయన పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుందామని భావించారు. ఈ మేరకు ఓ తెలుగు అమ్మాయితో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే, ఈ వ్యవహారం కూడా ముందుకు వెళ్లలేదు.

నిశ్చితార్థం క్యాన్సిల్‌ అయిపోయింది. ఇక, అప్పటినుంచి విశాల్‌ పెళ్లి, ప్రేమలపై పుకార్లు వస్తూనే ఉన్నాయి. వీటిలో కొన్నిటికి ఆయన డైరెక్టుగానే సమాధానం ఇచ్చారు. ప్రముఖ బహుభాషా నటి అభినయతో ఆయన పెళ్లి జరగబోతోందన్న ప్రచారం కూడా నడిచింది. ఈ ప్రచారాన్ని ఆయన ఖండిచారు. అలాంటిదేమీ లేదని, అభినయతో తాను ఏ సినిమా చేయటం వల్లే ఈ పుకార్లు వస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే విశాల్‌కు సంబంధించిన ఓ వీడియో  సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఆ వీడియోలో విశాల్‌ ఓ యువతితో రోడ్డుపై చక్కర్లు కొడుతూ ఉన్నారు. అలా కొన్ని అడుగులు నడిచిన తర్వాత ఎవర్నో చూసి.. తలను చొక్కాలో దాచుకుని ముందుకు వెళ్లిపోయారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ విశాల్‌ తన లవర్‌తో తిరుగుతున్నాడు’’.. ‘‘విశాల్‌ ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు’’.. ‘‘ విశాల్‌ రిలేషన్‌లో ఉన్నాడా? ఏంటి?’’ అని కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే, ఆ వీడియో సినిమా షూటింగ్‌కు సంబంధించినదిగా తేలింది.

ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా విశాల్‌, ఆ అమ్మాయితో అలా నడిచాడని, చొక్కాలో తల పెట్టి వెళ్లిపోయాడని వెల్లడైంది. దీంతో విశాల్‌ రిలేషన్‌షిప్‌ వార్తలకు చెక్‌ పడినట్లు అయింది. కాగా, విశాల్‌ తాజాగా ‘మార్క్ ఆంటోనీ’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం రత్నం అనే మూవీలో నటిస్తున్నారు. మరి, విశాల్‌ వైరల్‌ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss