iDreamPost
android-app
ios-app

Virat Kohli: వీడియో: కోహ్లీకి మెడల్‌! రోహిత్‌ రియాక్షన్‌ చూడండి..

  • Published Jan 19, 2024 | 7:20 PM Updated Updated Jan 19, 2024 | 7:20 PM

Virat Kohli, Rohit Sharma: ఆఫ్ఘనిస్థాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. అయితే.. మ్యాచ్‌ ముగిసిన తర్వాత విరాట్‌కో ఓ మెడల్‌ అందింది. ఈ సమయంలో రోహిత్‌ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, Rohit Sharma: ఆఫ్ఘనిస్థాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. అయితే.. మ్యాచ్‌ ముగిసిన తర్వాత విరాట్‌కో ఓ మెడల్‌ అందింది. ఈ సమయంలో రోహిత్‌ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 19, 2024 | 7:20 PMUpdated Jan 19, 2024 | 7:20 PM
Virat Kohli: వీడియో: కోహ్లీకి మెడల్‌! రోహిత్‌ రియాక్షన్‌ చూడండి..

బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్‌ స్టేడియంలో బుధవారం భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ థ్రిల్లర్‌గా సాగింది. హైస్కోర్‌ మ్యాచ్‌గా జరిగినా.. మ్యాచ్‌ టై కావడంతో ఏకంగా రెండు సూపర్‌ ఓవర్లు అవసరం అయ్యాయి. మూడు టీ20ల సిరీస్‌లో నామమాత్రంగా జరిగిన ఈ మ్యాచ్‌నే మొత్తం సిరీస్‌కు హైలెట్‌గా నిలిచింది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగడం, రింకూ సిక్సులతో విరుచుకుపడ్డం, విరాట్‌ కోహ్లీ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఔరా అనిపించడం, ఆఫ్గాన్‌ ఇండియాకు గట్టి పోటీ ఇవ్వడం.. మ్యాచ్‌ రెండు సూపర్‌ ఓవర్లకు దారితీయడంతో.. క్రికెట్‌ అభిమానులకు ఫుల్‌ క్రికెట్‌ మజాను అందించింది. దీంతో.. చాలా కాలం తర్వాత క్రికెట్‌ అభిమానులు నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేశారు.

అయితే.. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సెంచరీ హైలెట్‌గా నిలిచినా.. విరాట్‌ కోహ్లీ చేసిన సూపర్‌ ఫీల్డింగ్‌కు ఏకంగా మెడల్‌ దక్కింది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా వరుసగా 10 విజయాలు సాధించి ఫైనల్‌ చేరిన విషయం తెలిసిందే. అయితే.. ముందు జరిగిన ప్రతి మ్యాచ్‌లో అద్భుతమైన ఫీల్డింగ్‌ చేసి, సూపర్‌ క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్లకు భారత ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ ఒక మెడల్‌తో సత్కరించే సాంప్రదాయన్ని మొదలుపెట్టారు. అది సూపర్‌ సక్సెస్‌ అయింది.. పైగా ఆటగాళ్లలో ఉత్సాహం కూడా పెంచింది. అయితే.. మెడల్‌ సాంప్రదాయాన్ని ఆఫ్ఘాన్‌తో సిరీస్‌ మొత్తానికి కలిపి మళ్లీ మొదలుపెట్టాడు మన ఫీల్డింగ్‌ కోచ్‌.

kohli got medal rohit reaction

ఈ మెడల్‌ను రెండు మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్‌లో అద్భుతమైన ఇంటెంట్‌ చూపించి, కళ్లు చెదిరే క్యాచ్‌లు, సూపర్‌ సేవ్స్‌ చేసిన విరాట్‌ కోహ్లీకి ఆ మెడల్‌ను అందించాడు ఫీల్డింగ్‌ కోచ్‌. ఫీల్డ్‌లో కోహ్లీ చూపించే ఇంటెంట్‌.. చూపించే కమిట్‌మెంట్‌లో యువ క్రికెటర్లు సగం చూపించినా.. అద్భుతాలు జరుగుతాయని కోహ్లీని కొనియాడుతూ.. అతనికి మెడల్‌ను బహూకరించాడు. ఈ సమయంలో జట్టులోని ఆటగాళ్లంతా చప్పట్లతో కోహ్లీని అభినందించారు. అలాగే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం బిగ్‌స్మైల్‌తో చప్పట్లు కోడుతూ.. కోహ్లీని అభినందించాడు. కోహ్లీ మెడల్‌ అందుకుంటున్న సమయంలో రోహిత్‌ ఎంతో హ్యాపీగా చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.