Nidhan
The GOAT Movie, Thalapathy Vijay: దళపతి విజయ్ నటించిన కొత్త చిత్రం ‘ది గోట్’. రిలీజ్‌కు రెడీ అయిన ఈ మూవీ ముందు బిగ్ టార్గెట్ ఉంది. తెలుగు వెర్షన్ లాభాల్లోకి వెళ్లాలంటే బిగ్ మార్క్‌ను రీచ్ అవ్వాల్సి ఉంటుంది.
The GOAT Movie, Thalapathy Vijay: దళపతి విజయ్ నటించిన కొత్త చిత్రం ‘ది గోట్’. రిలీజ్‌కు రెడీ అయిన ఈ మూవీ ముందు బిగ్ టార్గెట్ ఉంది. తెలుగు వెర్షన్ లాభాల్లోకి వెళ్లాలంటే బిగ్ మార్క్‌ను రీచ్ అవ్వాల్సి ఉంటుంది.
Nidhan
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన కొత్త చిత్రం ‘ది గోట్’. విభిన్న చిత్రాలు తీసే వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ రిలీజ్‌కు రెడీ అయింది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 5వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో మంచి బజ్ నెలకొంది. అటు తమిళంతో పాటు తెలుగు నాట కూడా ‘ది గోట్’ రిలీజ్ కోసం వెయిటింగ్ నడుస్తోంది. అయితే విజయ్ సినిమా ముందు బిగ్ టార్గెట్ ఉంది. తెలుగు నాట ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెద్దగానే ఉంది. గత చిత్రాలతో ఇక్కడ చేసిన మ్యాజిక్‌ను విజయ్ మళ్లీ రిపీట్ చేస్తే ‘ది గోట్’కు ఢోకా ఉండదు. ఈ మూవీ తెలుగు వెర్షన్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
‘ది గోట్’ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ ధర చెల్లించి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.22 కోట్లకు హక్కులు తీసుకున్నట్లు సమాచారం. డబ్బింగ్ మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 22 కోట్ల టార్గెట్ అంటే పెద్ద మొత్తమే. కానీ రిటర్న్ చేసే అడ్వాన్స్ లెక్కలోనే కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని వినిపిస్తోంది. అయితే ఈ రేంజ్లో వసూళ్లు రావాలంటే విజయ్ ఫిల్మ్ బాగా పెర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఏపీ, సీడెడ్, తెలంగాణలో కలిపి 22 కోట్ల మార్క్‌ను టచ్ చేయాలంటే ‘ది గోట్’ బిగ్ హిట్ కావాల్సి ఉంటుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. మంచి ఓపెనింగ్ రావడంతో పాటు లాంగ్ రన్ ఉంటే గానీ లక్ష్యాన్ని అందుకోలేదని చెబుతున్నారు. పైగా మూవీకి గట్టి కాంపిటీషన్ కూడా ఉంది.
న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’ ఆల్రెడీ థియేటర్లలో ఉంది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్, మంచి రివ్యూస్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. నాని ఫిల్మ్‌తో పాటు విజయ్ ‘ది గోట్’కు ఇతర చిత్రాలతోనూ పోటీ నెలకొంది. ఇదే రోజు నివేదా థామస్ ‘35-చిన్న కథలు’ రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 6న నారా రోహిత్ ‘సుందరకాండ’ వస్తోంది. ఇవన్నీ దాటుకొని ‘ది గోట్’ టార్గెట్‌ను రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు. అయితే విజయ గత చిత్రం ‘లియో’ తెలుగులో రూ.40 కోట్ల వరకు గ్రాస్ రాబట్టడం, రూ.20 కోట్లకు పైగా నెట్ వసూలు చేయడంతో ‘ది గోట్’ విషయంలోనూ అదే మ్యాజిక్ రిపీట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ‘లియో’తో పాటు అంతకుముందు వచ్చిన ‘వారసుడు’, ‘బీస్ట్’, ‘విజిల్’, ‘మాస్టర్’ కూడా తెలుగులో మంచి విజయాలు సాధించాయి. కాబట్టి ఆయన ఇమేజ్, ప్రమోషన్స్, మూవీ నుంచి బయటకు వచ్చిన కంటెంట్ బాగుండటంతో ‘ది గోట్’ ఈజీగా టార్గెట్ రీచ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మరి.. విజయ్ మరో హిట్ కొడతాడా? మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.