తమిళ స్టార్ యాక్టర్, పొలిటీషియన్ విజయ్‌కాంత్ ఆరోగ్యంపై ఆయనకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రి ఒక బులెటిన్ విడుదల చేసింది. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులో ఏముందంటే..!
తమిళ స్టార్ యాక్టర్, పొలిటీషియన్ విజయ్‌కాంత్ ఆరోగ్యంపై ఆయనకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రి ఒక బులెటిన్ విడుదల చేసింది. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులో ఏముందంటే..!
ప్రముఖ నటుడు విజయ్‌కాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యాక్టర్‌గా ఎంతో పేరు గడించిన ఆయన.. డీఎండీకే అధినేతగా రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. పలు హిట్ ఫిల్మ్స్ ద్వారా తమిళంతో పాటు తెలుగులోనూ ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. పవర్ఫుల్ యాక్టింగ్‌తో అందర్నీ అలరించిన విజయ్‌కాంత్ హెల్త్ కండీషన్ సరిగ్గా లేదని మళ్లీ వార్తలు తెరమీదకు వచ్చాయి. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని సోషల్ మీడియాలోనూ న్యూస్ వచ్చింది. దీంతో ఈ హీరో అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. విజయ్‌కాంత్‌కు ఏమైందని అందరూ టెన్షన్ పడుతున్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్‌కాంత్ నవంబర్ 18 తేదీన చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరారు. దగ్గు, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్న ఆయనకు సాధారణ వైద్య పరీక్షల కోసమే తీసుకొచ్చామని డీఎండీకే నాయకులు అప్పట్లో తెలిపారు. అయితే సుమారు 10 రోజుల నుంచి ఆయన అక్కడే ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ విషయంపై వాళ్లు ఓ పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. విజయ్‌కాంత్ సాధారణ హెల్త్ టెస్టుల కోసమే హాస్పిటల్‌కు వెళ్లారని.. ఒకట్రెండు రోజుల్లో ఇంటికి తిరగొస్తారని చెప్పారు. ఎలాంటి వదంతులను నమ్మొద్దని ఆయన సన్నిహితులు తెలిపారు. కానీ విజయ్‌కాంత్‌కు ఇప్పటికీ హాస్పిటల్లోనే చికిత్స అందిస్తుండటంతో ఫ్యాన్స్‌లో అనుమానం పెరిగిపోయింది.
విజయ్‌కాంత్ ఇంకా ఆస్పత్రితోనే ఉండటంతో డాక్టర్లు ఏమైనా దాస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై మయత్ హాస్పిటల్ డాక్టర్లు బులెటిన్ రిలీజ్ చేశారు. విజయ్‌కాంత్ ఆరోగ్యం మెరుగుపడిందని అందులో తెలిపారు. నిన్నటిదాకా ఆయన బాగానే ఉన్నారని.. కానీ 24 గంటల నుంచి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు పల్మనరీ చికిత్స అందిస్తున్నామని మయత్ ఆస్పత్రి డాక్టర్లు బులెటిన్‌లో తెలిపారు. విజయ్‌కాంత్ త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నామని చెప్పుకొచ్చారు. డాక్టర్ల సూచన ప్రకారం మరో 14 రోజులు ఆస్పత్రిలో ఆయనకు నిరంతరం చికిత్స అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కాగా, లివర్ సమస్యతో బాధపడుతున్న విజయ్‌కాంత్‌కు ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తోందట. డయాబెటిస్ కారణంగా ఇప్పటికే ఆయన మూడు వేళ్లను డాక్టర్లు తొలగించారని తెలుస్తోంది. ఇక, విజయ్‌కాంత్ నటించిన సినిమాలు తెలుగు, కన్నడ భాషల్లో డబ్ అయి మంచి పేరు తెచ్చుకున్నాయి. ఆయన యాక్ట్ చేసిన ‘కెప్టెన్ ప్రభాకర్’ చిత్రం సంచలన విజయం నమోదు చేసింది. అయితే నటుడిగా తిరుగులేని ఇమేజ్ను సొంతం చేసుకున్న ఆయన.. డీఎండీకే అనే పార్టీని స్థాపించి 2006, 2011లో రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు.
ఇదీ చదవండి: రేషన్ కార్డు దారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి!
#JUSTIN | தேமுதிக தலைவர் விஜயகாந்தின் உடல்நிலை சீராக இல்லை – மருத்துவமனை நிர்வாகம் அறிக்கை!#Vijayakanth #DMDK #Vijaykanth #Galatta pic.twitter.com/AwkqurxtTN
— Galatta Media (@galattadotcom) November 29, 2023