iDreamPost
android-app
ios-app

కాంట్రవర్సీ బ్యూటీతో విజయ్ సేతుపతి! కాంబో మామూలుగా లేదుగా..

  • Author ajaykrishna Published - 01:21 PM, Fri - 21 July 23
  • Author ajaykrishna Published - 01:21 PM, Fri - 21 July 23
కాంట్రవర్సీ బ్యూటీతో విజయ్ సేతుపతి! కాంబో మామూలుగా లేదుగా..

దక్షిణాది స్టార్ హీరోల సరసన బాలీవుడ్ భామలు నటించడం కొత్త కాదు. ఎన్నో ఏళ్లుగా ఇది జరుగుతూ వస్తోంది. అంతెందుకు తెలుగు హీరోల కోసం దర్శకనిర్మాతలే.. దగ్గరుండి నార్త్ బ్యూటీలను తీసుకొస్తుంటారు. స్ట్రెయిట్ గా మెయిన్ రోల్ ఇచ్చేసి ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. అలా ఇప్పటిదాకా ఎంతోమంది నార్త్ ముద్దుగుమ్మలు సౌత్ లోకి వచ్చారు. కొన్నాళ్ళపాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా అలరించారు. అయితే.. ఇక్కడ స్టార్డమ్ రాకపోయినా.. చేసిన వరకు మంచి సినిమాలే చేసింది అనిపించుకున్న వారిలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకీ ఆ ఫైర్ బ్రాండ్ ఎవరో తెలుసు కదా.. కంగనా రనౌత్.

ఈ భామ గురించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్స్ గా పేరు తెచ్చుకుంది కంగనా. అలాగని సినిమాల పరంగా మైనస్ లు లేవు. కేవలం ఆమె నోటి దురుసు వల్ల లేనిపోనీ ఆటంకాలు కొని తెచ్చుకుంటుంది. ఎలాగైతే ఏంటి.. వార్తల్లో నిలుస్తుంది కదా అనుకుంటే అంతే ఇక. అయితే.. ఈ భామ కొంతకాలంగా కేవలం లేడీ ఓరియెంటెడ్ మూవీస్ మాత్రమే చేస్తోంది. ఆ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద విఫలం అవుతూ వస్తున్నాయి. మరోవైపు ఫేమస్ పర్సనాలిటీలకు సంబంధించి బయోపిక్స్ లో కూడా నటిస్తోంది. ఇలాంటి తరుణంలో ఈ ఫైర్ బ్రాండ్ కోలీవుడ్ స్టార్ హీరోతో రొమాన్స్ చేయనుందని టాక్ వినిపిస్తుంది.

Vijay sethupathi acting with kangana ranaut

ఆ వివరాల్లోకి వెళ్తే.. తలైవి తర్వాత కంగనా రీసెంట్ గా తమిళంలో ‘చంద్రముఖి 2’ చేసింది. ఆ సినిమా ఆగష్టు 15న రిలీజ్ కి రెడీ అవుతోంది. మరోవైపు ట్రైడెంట్ ఆర్ట్స్, అహింస ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఓ సినిమా నిర్మిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే.. ఆ సినిమాలో ఓ తమిళ హీరో, హిందీ హీరోయిన్ నటిస్తారని చెప్పారు. ఇప్పుడు ఆ హింట్ ప్రకారం.. హీరోగా విజయ్ సేతుపతిని, హీరోయిన్ గా కంగనాని ఓకే చేశారని సమాచారం. పైగా ఈ సినిమాని మలయాళం డైరెక్టర్ విపిన్ తెరకెక్కిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎలాంటి కాంట్రవర్సీ లేని విజయ్ సేతుపతి, కాంట్రవర్సీ క్వీన్ కంగనాల కెమిస్ట్రీ తెరపై ఎలా ఉండబోతుందో చూడాలని ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. మరి విజయ్ సేతుపతి, కంగనాల జోడి ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigbossgrandpashabet