iDreamPost
android-app
ios-app

పోలీసులను ఆశ్రయించిన విజయ్ దేవరకొండ మేనేజర్.. ఏం జరిగిందంటే

  • Published Apr 08, 2024 | 8:07 AM Updated Updated Apr 08, 2024 | 8:07 AM

Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ మేనేజర్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు చేశాడు. దేని గురించి అంటే..

Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ మేనేజర్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు చేశాడు. దేని గురించి అంటే..

  • Published Apr 08, 2024 | 8:07 AMUpdated Apr 08, 2024 | 8:07 AM
పోలీసులను ఆశ్రయించిన విజయ్ దేవరకొండ మేనేజర్.. ఏం జరిగిందంటే

టాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నిలదొక్కుకున్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. సపోర్టింగ్ రోల్స్ చేస్తూ.. హీరోగా పరిచయం అయ్యాడు. అర్జున్ రెడ్డి సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. గీతగోవిందం, డియర్ కామ్రెడ్ మూవీలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. లైగర్ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకుని.. తన క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు. ఇక అభిమానులు ముద్దుగా ఇతడిని రౌడీ అని పిలుస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా విజయ్ దేవరకొండ మేనేజర్ పోలీసులను ఆశ్రయించాడు. ఆ వివరాలు..

విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. అసలు ఇండియాలో షో పడకముందే.. ఈ సినిమాపై నెగిటివ్ టాక్ ప్రచారంలోకి వచ్చింది. ఇక కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ అయితే నెగిటివ్ థంబ్ నెయిల్స్ పెట్టి మరీ సినిమా గురించి తప్పుడు ప్రచారం చేశాయి. అసలు మూవీ విడుదల కాకముందే రివ్యూ ఎలా చెప్పారంటూ నెటిజనులు కూడా సదరు చానెల్స్ మీద విమర్శలు చేశారు. అయితే యూఎస్ ప్రీమియర్ల నుంచే ఈ ఇది మొదలైంది.

Manager Vijay Devarakonda approached the police

సినిమాపై ఎంత నెగిటివ్ ప్రచారం సాగినా.. ఆడియన్స్ మాత్రం మూవీని ఆదరిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే కావాలనే కొందరు విజయ్ మీద పని గట్టుకుని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని.. సినిమా ఫెయిల్ కావాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని అర్థం అవుతోంది. ఈక్రమంలో నెగెటివ్ ప్రచారం చేసే భరతం పట్టేందుకు విజయ్ దేవరకొండ టీమ్ రంగంలోకి దిగింది.

సినిమా విడుదలకు ముందు నుంచే సాగుతున్న నెగిటివ్ ప్రచారం కాస్త.. ఫ్యామిలీ స్టార్ సినిమా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దృష్టికి వచ్చాయట. నిర్మాణ సంస్ధ ఇచ్చిన సోషల్ మీడియా స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియా గ్రూప్స్, వాటి అకౌంట్స్ సమాచారం ఆధారంగా విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ కలిసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కావాలనే కొందరు ఫ్యామిలీ స్టార్ సినిమా దుష్ప్రచారం చేస్తున్నారని.. సినిమా చూడాలనుకునే ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెగిటివ్ ప్రచారం సినిమా వసూళ్లపై ప్రభావం చూపుతుందని తమ ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ టీమ్ ఇచ్చిన ఫిర్యాదు, ప్రాథమిక ఆధారాలు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.