Tirupathi Rao
The Family Star Trailer Review: విజయ్ దేవరకొండ- మృణాళ్ ఠాకూర్ జటంగా వస్తున్న ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు.
The Family Star Trailer Review: విజయ్ దేవరకొండ- మృణాళ్ ఠాకూర్ జటంగా వస్తున్న ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు.
Tirupathi Rao
విజయ్ దేవరకొండ– మృణాళ్ ఠాకూర్ జంటగా పరుశురాం డైరెక్షన్ వహించిన చిత్రం ది ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది. ఇప్పటికే పోస్టర్స్, సాంగ్స్, గ్లిప్స్ లు వదిలి ఆడియన్స్ లో అంచనాలు పెంచేశారు. ఇప్పుడు నేరుగా ట్రైలర్ విడుదల చేసి ఆ అంచనాలను ఆకాశానికి చేర్చేశారు. సాధారణంగా విజయ్ దేవరకొండ మూవీ అంటే మినిమం ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. విజయ్ కి జోడీగా మృణాళ్ ఠాకూర్ ఉండటంతో అవి మరో ఎత్తుకు వెళ్లాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ విజయ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ది ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
మొదటి నుంచి వస్తున్న అప్ డేట్స్ చూస్తే ఫ్యామిలీ స్టార్ సినిమా మొత్తం.. సగటు మధ్యతరగతి వ్యక్తి కథకు చాలా దగ్గరగా ఉంటుందని అందరూ అనుకున్నారు. వారి అంచనాలను ఏమాత్రం తీసేయకుండా ట్రైలర్ సరిగ్గా అలాగే ఉంది. ఈ ట్రైలర్ చూస్తే.. ఫ్యాన్స్ అందరికీ గీతాగోవిందం వైబ్స్ గుర్తొస్తున్నాయి. అయితే ఫ్యామిలీ స్టార్ లో ఆ పాత్రకు అదనంగా విజయ్ లో యాక్షన్ యాంగిల్ కూడా ఉంది. అండి అండి అంటూ బతిమిలాడటం తెలుసు.. అలాగే పిడికిలి బిగించి చాచి కొట్టడం కూడా తెలుసు అన్నట్లు చూపిస్తున్నారు. తాను నమ్మింది కరెక్ట్ అంటే యుద్ధం చేయడం. తన తప్పు ఉంటే నలుగురిలో కాళ్లు పట్టుకునేలా క్యారెక్టర్ డిజైన్ చేశారు.
ఈ మూవీలో విజయ్ క్యారెక్టరైజేషన్, మృణాళ్ తో లవ్ ట్రాక్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అలాగే చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉన్నాయి. అప్పట్లో ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ ఎంత వైరల్ అయ్యిందో తెలుసు. ఈసారికి ఆ డైలాగ్ ని ఈ ట్రైలర్ లో పెట్టలేదు. కానీ, అంతుకు మించిన డైలాగ్స్, ఫ్యామిలీ బాండింగ్, లవ్ అండ్ ఎమోషన్స్ ని హైలెట్ చేశారు. మొత్తానికి ఈసారి మాత్రం విజయ్ ఖాతాలో అదిరిపోయే హిట్టు పడబోతోంది అంటున్నారు. ఈ సినిమాని అబ్రాడ్ లో కూడా షూట్ చేశారు. కొంత కథ విదేశాల్లో కూడా జరిగినట్లు చూపించారు. మూవీ టేకింగ్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉంది. ఎంతో రిచ్ గా ఉంది. మరి.. ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.