iDreamPost
android-app
ios-app

Hesham Abdul Wahab దేవరకొండ సామ్ సినిమాకు కొత్త మ్యూజిక్ టాలెంట్

  • Published Apr 20, 2022 | 7:04 PM Updated Updated Apr 20, 2022 | 7:04 PM
  • Published Apr 20, 2022 | 7:04 PMUpdated Apr 20, 2022 | 7:04 PM
Hesham Abdul Wahab దేవరకొండ సామ్ సినిమాకు కొత్త మ్యూజిక్ టాలెంట్

ఎంతసేపూ తమన్ దేవిశ్రీ ప్రసాద్ తప్ప చెప్పుకోదగ్గ గొప్ప ఆప్షన్ లేకుండా పోతున్న టాలీవుడ్ కు సరికొత్త సంగీత దర్శకుడు రాబోతున్నారు. అనూప్ రూబెన్స్ లాంటి ఒకరిద్దరు ఉన్నా బడ్జెట్ ఎక్కువగా పెట్టే సినిమాల కోసం తగినంత టైం ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ లేకుండా పోతున్నారు. అందుకే విజయ్ దేవరకొండ కొత్త సినిమా కోసం మల్లూ వుడ్ టాలెంట్ ని తీసుకొస్తున్నారు. అతని పేరు హేశం అబ్దుల్ వహాబ్. ఇటీవలే మలయాళంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న హృదయంకు పాటలు ఇచ్చింది ఇతనే. వన్ అఫ్ ది బెస్ట్ వర్క్ అఫ్ కేరళ మ్యూజిక్ గా దీనికి చాలా పేరు వచ్చింది. హృద్యమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చాడు.

ఇక విషయానికి వస్తే విజయ్ దేవరకొండ సమంతా కాంబినేషన్ లో రూపొందబోయే ఎమోషనల్ ఎంటర్ టైనర్ కి అబ్దుల్ వహాబ్ నే ఎంచుకున్నట్టు తెలిసింది. రేపు దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ చేయబోతున్నారు. ఈ నెల 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది. ముందు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తారనే ప్రచారం జరిగింది కానీ అనూహ్యంగా ఇప్పుడు వహాబ్ పేరు ఫైనల్ కావడం విశేషం. ఇంకా టీమ్ తరఫున అఫీషియల్ నోట్ రాలేదు కానీ రేపు అన్ని వివరాలు తెలియజేయబోతున్నారు. విజయ్ దేవరకొండ సమంతాలు గతంలో మహానటిలో కలిసి నటించారు కానీ అందులో ఫుల్ లెన్త్ రోల్స్ కాదు.

లైగర్ పూర్తి చేశాక జనగణమన కోసం పూరి జగన్నాధ్ కే కమిట్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడీ సినిమాతో మొత్తం మూడు లైన్ లో పెట్టాడు. సుకుమార్ తో ప్రాజెక్ట్ ఇంకా టైం పట్టేలా ఉంది. ఆయన పుష్ప పార్ట్ 2 పూర్తి చేసేలోగా 2022 పూర్తవుతుంది కాబట్టి అప్పటిదాకా ఇది పట్టాలెక్కే ఛాన్స్ లేదు. ఈలోగా ఇవి ఫినిష్ చేసుకుంటే లైనప్ పరంగా ఇబ్బంది ఉండదు. పుష్ప ఐటెం సాంగ్ తర్వాత మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన సమంతాకు అవకాశాలు బాగా వస్తున్నాయి. శాకుంతలం ఆల్రెడీ ఫినిష్ కాగా యశోద సగానికి పైగా పూర్తయ్యింది. విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి చేసిన తమిళ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. తెలుగు డబ్బింగ్ ఇంకా డిసైడ్ చేయలేదు

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss