iDreamPost
android-app
ios-app

Family Star: ఫ్యామిలీ స్టార్ పై ట్రోల్స్.. మేము ఫూల్స్ కాదంటూ విజయ్ దేవరకొండ రిప్లయ్!

  • Published Apr 01, 2024 | 6:47 PM Updated Updated Apr 01, 2024 | 6:47 PM

విజయ్ దేవర కొండా, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా "ఫ్యామిలీ స్టార్" ఏప్రిల్ 5న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ప్రమోషన్ లో ఎదురైన కొన్ని ప్రశ్నలకు.. మేమేమీ ఫూల్స్ కాదంటూ విజయ్ రిప్లై ఇచ్చాడు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏమై ఉంటుంది.

విజయ్ దేవర కొండా, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా "ఫ్యామిలీ స్టార్" ఏప్రిల్ 5న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ప్రమోషన్ లో ఎదురైన కొన్ని ప్రశ్నలకు.. మేమేమీ ఫూల్స్ కాదంటూ విజయ్ రిప్లై ఇచ్చాడు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏమై ఉంటుంది.

  • Published Apr 01, 2024 | 6:47 PMUpdated Apr 01, 2024 | 6:47 PM
Family Star: ఫ్యామిలీ స్టార్ పై ట్రోల్స్.. మేము ఫూల్స్ కాదంటూ విజయ్ దేవరకొండ రిప్లయ్!

పరశురామ్ దర్శకత్వంలో.. దిల్ రాజు నిర్మాతగా.. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ఫ్యామిలీ స్టార్”. ఈ సినిమాను ఏప్రిల్ 5న తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్ కు భారీ స్పందన లభించడంతో.. అందరికి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అందులోను విజయ్ దేవరకొండకు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసే విషయంలో.. లవర్ బాయ్ గా ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉండడంతో .. ఇక ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలి మ్యాన్ గా చూడడం కోసం.. అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సీతారామం సినిమాతో అందరికి దగ్గరైన మృణాల్ ఠాకూర్.. ఈ సినిమాలో విజయ్ కు జోడిగా నటించడంతో .. వీరిద్దరి కాంబినేషన్ ను తెరపై చూసేందుకు అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ సినిమా ప్రమోషన్ లో విజయ్ కు కొన్ని ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. అవేంటంటే..

“ఫ్యామిలీ స్టార్” సినిమాకు ఇంకా కొద్దీ రోజులు సమయం మాత్రమే ఉండడంతో.. చిత్ర బృందం అంతా కూడా సినిమా ప్రమోషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో తెలుగు, తమిళ స్టేట్స్ లో సినిమా ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ప్రమోషన్స్ లో మృణాల్, విజయ్ దేవరకొండ కూడా చాలా భాద్యతగా అటెండ్ అవుతున్నారు. అయితే, మూవీ ప్రమోషన్స్ చేసే క్రమంలో వీరికి ఊహించని ప్రశ్నలు ఎదురౌతున్నాయి. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఒకరు విజయ్ ను ఇలా అడిగారు .. “ట్రైలర్ లో చూస్తే మాత్రం.. పెట్రోల్ కొట్టించడానికి కూడా డబ్బులు లేని ఒక మధ్య తరగతి అబ్బాయిలా కనిపించారు. కానీ, కళ్యాణి వచ్చా వచ్చా సాంగ్ లో మాత్రం రిచ్ లుక్ లో కనిపించారు. అది దిల్ రాజు గారి ఎఫెక్ట్ ఆ!” అని అడిగాడు. దీనితో వెంటనే విజయ్ , దిల్ రాజు స్పందించారు. విజయ్ ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఇలా అన్నాడు.

“మన అందరికి బడ్జెట్ లేకపోయినా.. డ్రీమ్స్ అయితే ఉంటుంది కదా.. అది డ్రీమ్ సాంగ్ అయి ఉంటుంది. లేదా ఆ మనిషి మిడిల్ క్లాస్ ఏ .. కానీ తర్వాత పైకి ఎదగడా.. మేము కూడా ఏమి ఫూల్స్ కాదు .. రూపాయి పెట్రోల్ కు డబ్బులు అడిగి.. రిచ్ గా పెళ్లి చేసుకోడానికి. అంత లాజిక్ గా సినిమాలు తీయడానికి. కాబట్టి సినిమాను సినిమాలనే చూడండి. సినిమా చూసిన తర్వాత మీ అందరికి ఒక క్లారిటీ వస్తుంది.” అంటూ విజయ్ స్పందించాడు. గతంలోనూ ఒక తమిళ ప్రమోషన్లో విజయ్ కు ఇలాంటి ట్రోల్స్ ఏ ఎదురయ్యాయి. మూవీ ప్రమోషన్స్ లోనే ఇన్ని ట్రోల్ల్స్ అండ్ కామెంట్స్ వస్తుంటే .. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి ట్రోల్స్ వస్తాయో అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమాపైన అందరికి చాలానే అంచనాలు ఉన్నాయి. ఇక ఏప్రిల్ 5న థియేటర్ లో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss