iDreamPost
android-app
ios-app

మంచో చెడో.. అంటూ బేబీ మూవీ సక్సెస్ పై విజయ్ దేవరకొండ కామెంట్స్!

  • Author ajaykrishna Published - 09:52 AM, Tue - 18 July 23
  • Author ajaykrishna Published - 09:52 AM, Tue - 18 July 23
మంచో చెడో.. అంటూ బేబీ మూవీ సక్సెస్ పై విజయ్ దేవరకొండ కామెంట్స్!

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ సినిమా.. ఇటీవల విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది. అటు కలెక్షన్స్ పరంగా కూడా బేబీ దూసుకుపోతుంది. దీంతో తాజాగా బేబీ మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్ కి స్పెషల్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. అలాగే బేబీ మూవీ గురించి, మూవీ టీమ్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం బేబీ గురించి విజయ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ విజయ్ ఏమన్నాడంటే.. “గత కొద్దిరోజులుగా బేబీ మూవీ గురించి ఆనందంగా ఉంది. సినీ ప్రేమికుడిగా, తమ్ముడు సక్సెస్ చూసిన అన్నగా చాలా హ్యాపీ. రిలీజ్ ముందురోజు బేబీ ప్రీమియర్స్ చూశాను. అందరూ నా రెస్పాన్స్ కోసం వెయిట్ చేశారు. లాస్ట్ లో ఎమోషనల్ టచ్ వల్ల మాటలు రాలేదు. ఏమి మాట్లాడలేకపోయాను. ఫస్ట్ టైమ్ నేను యాక్టర్ అని మర్చిపోయి ప్రేక్షకుడిగా సినిమా ఎంజాయ్ చేశాను. మంచో చెడో బేబీ గురించి అందరూ మాట్లాడుకుంటారు. డిబేట్స్ పెడుతున్నారు. అంటే.. సాయి రాజేష్ ఎంచుకున్న కథ కథ.. అంత బలంగా అందరిని ప్రభావితం చేసింది. సొసైటీల్లో ప్రేమికులను మోసం చేసే అమ్మాయిలు ఉన్నారు. అలా అని అందరూ కాదు. అబ్బాయిల్లో కూడా ఉన్నారు. నా లైఫ్ లో మాత్రం అందమైన.. మనసున్న అమ్మాయిలే దొరికారు’ అని విజయ్ చెప్పాడు.

అనంతరం.. సినిమా టీమ్ ని, యాక్టర్స్ ని అభినందించిన విజయ్.. లైఫ్ లో సక్సెస్ ని ఎంజాయ్ చేయాలి.. ఫెయిల్యూర్ నుండి నేర్చుకోవాలి అని యూత్ కి మెసేజ్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఓవైపు ఖుషి సినిమాని రిలీజ్ కి సిద్ధం చేస్తూనే.. మరోవైపు పరశురామ్, గౌతమ్ తిన్ననూరి సినిమాలు సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఇక ఖుషి సినిమాలో విజయ్ సరసన సమంత నటించింది. మహానటి తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ మూవీ ఇది. ఈ సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. మరి బేబీ సక్సెస్ఓ విజయ్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişMadridbetMariobetmeritbetcasibom girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetcasibom girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş