Tirupathi Rao
Family Star Teaser Review: విజయ్ దేవరకొండ- మృణాళ్ జంటగా వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ టీజర్ ని తాజాగా రిలీజ్ చేశారు. మరి.. టీజర్ ఎలా ఉందో చూద్దాం.
Family Star Teaser Review: విజయ్ దేవరకొండ- మృణాళ్ జంటగా వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ టీజర్ ని తాజాగా రిలీజ్ చేశారు. మరి.. టీజర్ ఎలా ఉందో చూద్దాం.
Tirupathi Rao
పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ– మృణాళ్ ఠాకూర్ జంటగా వస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నిజానికి సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, నిర్మాత దిల్ రాజు స్వచ్ఛందంగా బరి నుంచి తప్పుకుని మిగిలిన చిత్రాల రిలీజ్ కు హెల్ప్ చేశారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్, డైలాగ్స్ అన్నీ ఎంతగానో వైరల్ అయ్యాయి. అలాగే మూవీపై అంచనాలను కూడా పెంచేశాయి. ఇప్పుడు ఈ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు. మరి.. ఆ టీజర్ ఎలా ఉందో చూద్దాం.
విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఏదైనా ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని అలరిస్తాడు. ఇంక మృణాళ్ అయితే చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైపోయింది. ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ విషయానికి వస్తే.. ఇద్దరూ ఎంతో ఈజ్ తో యాక్ట్ చేశారు. మన ఇంట్లోనో.. మన చుట్టూనే ఉండే కపుల్స్ తరహాలో, ఒక పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవితాన్ని ఈ ఫ్యామిలీ స్టార్ తో ఆవిష్కరించబోతున్నారు అనే విషయం అయితే అర్థమవుతోంది. ఇంక ఈ సినిమా ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత ఆడియన్స్ అంతా.. ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ టీజర్ లో విజయ్ దేవరకొండను అటు హోమ్లీగా చూపిస్తూనే.. మరోవైపు ఫుల్ వైలెంట్ గా చూపిస్తున్నారు. ఈ టీజర్ ప్రకారం.. విజయ్ క్యారెక్టర్ తన పని తాను చేసుకెళ్లే మనస్తత్వంలా ఉంది. కానీ, తన దారిలోకి గానీ, తన ఫ్యామిలీ జోలికి గానీ వస్తే మాత్రం టెంపర్ మెంట్ తో రెచ్చిపోయే సగటు మధ్యతరగతి కుర్రాడిలా చూపిస్తున్నారు. అంతేకాకుండా లాస్ట్ లో మృణాల్ బండి మీద దించమంటే.. లీటరు పెట్రోలు కొట్టిస్తే దించేస్తా అనే డైలాగ్ చాలా మందికి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఐరనే వంచాలా ఏంటి? లాగా వైరల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. దీని మీద రేపటి నుంచి రీల్స్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అసరం లేదు. మరి.. ఫ్యామిలీ స్టార్ టీజర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.