iDreamPost
android-app
ios-app

అంత దుఃఖంలోను.. వాళ్ల కోసం విజయ్ ఆంటోనీ కీలక నిర్ణయం!

  • Author ajaykrishna Updated - 12:35 PM, Sat - 23 September 23
  • Author ajaykrishna Updated - 12:35 PM, Sat - 23 September 23
అంత దుఃఖంలోను.. వాళ్ల కోసం విజయ్ ఆంటోనీ కీలక నిర్ణయం!

ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు తాము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా.. సినిమా బతకాలని కోరుకుంటారు. పర్సనల్ గా ఎలాంటి లాస్ లో ఉన్నప్పటికీ.. సినిమా రిలీజ్ ఆగకుండా.. నిర్మాతలు నష్టపోకుండా జాగ్రత్త పడుతుంటారు. అలాంటి మంచి మనసున్న హీరో అనిపించుకున్నాడు విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు సినిమాతో తెలుగులో సూపర్ ఫేమ్ సంపాదించుకున్న విజయ్.. హీరో కాకముందు మంచి మ్యూజిక్ డైరెక్టర్. తెలుగు, తమిళ భాషలలో చాలా సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు. అయితే.. మ్యూజిక్ వైపు కొనసాగుతూనే యాక్టింగ్ పై ఆసక్తితో హీరోగా ట్రై చేశాడు విజయ్.

అనుకున్నట్లుగా హీరో అయిపోయాడు. మొదటి సినిమాగా బిచ్చగాడు చేశాడు. ఇంకేముంది ఒకే సినిమా విజయ్ కెరీర్ మార్చేసింది. అప్పటినుండి హీరోగా ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా సినిమాలు చేస్తూ పోతున్నాడు. ఇటీవల బిచ్చగాడు 2, హత్య సినిమాలు చేశాడు. ఇప్పుడు తాజాగా ‘రత్తం’ అనే సినిమా రిలీజ్ కి రెడీ చేశాడు. అక్టోబర్ 6న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ప్రమోషన్స్ మొదలైపోయాయి. కానీ.. అనూహ్యంగా తన కూతురు మీరా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఒక్కసారిగా విజయ్ లైఫ్ ని కుదిపేసింది. అతని 16 ఏళ్ళ కూతురు మీరా ఇంట్లోనే ఉరి వేసుకొని మరణించింది. ఈ షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఇదిలా ఉండగా.. కూతురు మరణవార్తను ఇంకా విజయ్ ఆంటోనీ ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతుంది. తన కూతురు మరణంతో తాను కూడా మరణించినంత పనైందని విజయ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతటి దుఃఖంలో కూడా తన సినిమాని నిర్మించిన నిర్మాతల మంచి కోరాడు విజయ్. తాను హీరోగా నటించిన రత్తం మూవీ అనుకున్నట్లుగా అక్టోబర్ 6న రిలీజ్ చేసేయాలని.. రిలీజ్ ని ఆపొద్దని పిలుపునిచ్చాడట విజయ్. ఇప్పటికే ఆ సినిమా వాయిదా పడుతూ ఇంతవరకు వచ్చింది. సో.. నిర్మాతలకు నష్టం రాకుండా ఉండాలంటే రిలీజ్ చేసేయడం బెటర్ అని చెప్పినట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా విజయ్ నిర్ణయం పట్ల షాక్ అవుతూనే.. అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్, దర్శకనిర్మాతలు. ఇక ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుందా లేదా తెలియాల్సి ఉంది. మరి విజయ్ ఆంటోనీ నిర్ణయం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom