Devara: VFX టీమ్ క్రేజీ అప్డేట్.. ‘దేవర’పై అంచనాలు పెంచేసిందిగా..!

దేవర మూవీకి సంబంధించి మా వర్క్ స్టార్ట్ చేశాం అంటూ ప్రముఖ VFX సంస్థ అల్జాహ్రా స్టూడియో ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ప్రస్తుతం దేవరపై అంచనాలను అమాంతం పెంచేసింది.

దేవర మూవీకి సంబంధించి మా వర్క్ స్టార్ట్ చేశాం అంటూ ప్రముఖ VFX సంస్థ అల్జాహ్రా స్టూడియో ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ప్రస్తుతం దేవరపై అంచనాలను అమాంతం పెంచేసింది.

‘దేవర’ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన ప్రతీ ప్రచార చిత్రం బంపర్ హిట్ అయ్యింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తైనట్లు తెలుస్తోంది. ఇక మా వర్క్ స్టార్ట్ చేశాం అంటూ ప్రముఖ VFX సంస్థ అల్జాహ్రా ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ప్రస్తుతం దేవరపై అంచనాలను అమాంతం పెంచేసింది.

దేవర మూవీ కోసం తారక్ ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ లవర్స్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. మూవీ షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి ఇదే విషయాన్ని ఆ సంస్థ సాలిడ్ అప్డేట్ తో తెలిపింది. “దేవరకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మరికొద్ది రోజులు మీరందరూ ఎదురుచూసే దేవర మీ ముందుకు రాబోతోంది. మా టీమ్ వీఎఫ్ ఎక్స్ ను ఛాలెంజింగ్ గా తీసుకుని తుదిమెరుగులు దిద్దుతున్నాం. గెట్ రెడీ టు ఎక్స్ పీరియన్స్ బ్లడ్ అండ్ షార్ప్ టీత్ ఆన్ బిగ్ స్క్రీన్” అంటూ రక్తం ఏరులై పారాల్సిందే అన్న రేంజ్ లో సినిమా ఉండబోతోంది అని రాసుకొచ్చింది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది అని చెప్పకనే చెప్పింది.

కాగా.. అల్జాహ్రా స్టూడియోస్ గతంలో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, పొన్నియన్ సెల్వన్ 1, సాహో లాంటి సినిమాలకు అద్భుతమైన వీఎఫ్ఎక్స్ అందించింది. ఇప్పుడు దేవర కోసం ఈ కంపెనీ పనిచేయబోతోంది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీలో గ్రాఫిక్స్ ఎక్కువగానే ఉంటుందని ముందు నుంచి మేకర్స్ చెప్పుకొస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే అల్జాహ్రా కంపెనీతో వీఎఫ్ఎక్స్ ను చేపిస్తున్నారు. ఇక ఇప్పుడు వీరు ఈ సినిమా గురించి ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది. మరి సెప్టెంబర్ 27న రాబోయే దేవర కోసం ఎంతమంది ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments