iDreamPost
android-app
ios-app

ఘట్టమనేని వంశం నుంచి మరో వారసుడు! ఫస్ట్ లుక్ తోనే కేకపెట్టించాడు..

  • Published Aug 20, 2024 | 11:46 AM Updated Updated Aug 20, 2024 | 12:29 PM

Ghattamaneni Jayakrishna: సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అవుతోంది. మహేశ్ బాబు అన్నయ్య దివంగత నటుడు రమేశ్ బాబు కొడుకు జయకృష్ణ ఇండస్ట్రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.

Ghattamaneni Jayakrishna: సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అవుతోంది. మహేశ్ బాబు అన్నయ్య దివంగత నటుడు రమేశ్ బాబు కొడుకు జయకృష్ణ ఇండస్ట్రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.

  • Published Aug 20, 2024 | 11:46 AMUpdated Aug 20, 2024 | 12:29 PM
ఘట్టమనేని వంశం నుంచి మరో వారసుడు! ఫస్ట్ లుక్ తోనే కేకపెట్టించాడు..

టాలీవుడ్ లోకి ఎంతో మంది నట వారసులు వచ్చారు. తమదైన నటనతో తండ్రికి తగ్గ తనయులుగా రాణిస్తున్నారు. ఇక మరికొందరు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడు ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. మహేశ్ బాబు అన్నయ్య దివంగత నటుడు రమేష్ బాబు కొడుకు జయకృష్ణ డెబ్యూకి రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు అతడి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫస్ట్ లుక్ తోనే కేకపెట్టిస్తున్నాడు జయకృష్ణ.

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అవుతోంది. మహేశ్ బాబు అన్నయ్య దివంగత నటుడు రమేశ్ బాబు కొడుకు జయకృష్ణ ఇండస్ట్రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. జనాల స్పందన తెలుసుకోవడానికి అతడి పిక్ ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో స్టైలిష్ గా పక్కా హీరో మెటీరియల్ గా కనిపిస్తున్నాడు జయకృష్ణ. పైగా మహేశ్ దగ్గరి పోలికలతో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గౌతమ్ ఎంట్రీకి ఇంకా టైమ్ పడుతుంది. ఈలోగా జయకృష్ణ డెబ్యూ చేసి మంచి హిట్ కొడితే.. గౌతమ్ కు అది కలిసొస్తుంది.

ఇక జయకృష్ణ కెరీర్ కు సంబంధించిన విషయాలను మహేశ్ దగ్గరుండి చూసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్న రమేశ్ బాబు సామ్రాట్, బ్లాక్ టైగర్, కలియుగ అభిమన్యుడు, బజారు రౌడీ వంటి సినిమాల్లో హీరోగా చేశాడు. అయితే ఆ తర్వాత సినిమాలు వదిలేసి నిర్మాణ, ఇతర బిజినెస్ లు చూసుకున్నాడు. ఇక ఇప్పుడు జయకృష్ణను హీరోగా నిలబడితే.. తండ్రి కోరిక నెరవేరినట్లే. కాగా.. ప్రస్తుతం ఘట్టమనేని వంశం నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు తో పాటుగా సుధీర్ బాబు ఇండస్ట్రీలో ఉన్నారు. గౌతమ్ డెబ్యూకి ఇంకాస్త టైమ్ పట్టేలా ఉంది. ఈ గ్యాప్ లో జయకృష్ణ డెబ్యూ ఇస్తే బాగుంటుంది అన్నది ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఆలోచన. చూడాలి మరి ఏ సినిమాతో ఇతడు పరిశ్రమలోకి అడుగుపెడతాడో.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom