iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో విషాదాలు ఆగడం లేదు. . ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలతో పాటు పలువురు సెలబ్రిటీలు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా మరో నటి కన్నుమూసిందన్న వార్త వినిపిస్తుంది.

సినీ ఇండస్ట్రీలో విషాదాలు ఆగడం లేదు. . ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలతో పాటు పలువురు సెలబ్రిటీలు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా మరో నటి కన్నుమూసిందన్న వార్త వినిపిస్తుంది.

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటాయి. బాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు ఎంతో మంది ప్రముఖులు తుదిశ్వాస విడిచారు. సినీ నటులు, దర్శక, నిర్మాతలు, గేయ రచయిత ఇలా పలువురు మృత్యువాత పడ్డారు. ఆదిపురుష్ నటి ఆశా వర్మ, నటుడు నిర్మల్ బెన్నీ, తమిళ స్టార్ కమెడియన్ బిజిలి రమేష్, టాలీవుడ్ గీత రచయిత గురు చరణ్, బాలీవుడ్ నటుడు వికాస్ సేథీ, కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఢిల్లీ బాబు, సిఐడీ శకుంతల తదితరులు మృతి చెందారు. వీరంతా ఆయా ఇండస్ట్రీల్లో పేరు మోసిన సెలబ్రిటీలు కావడం గమనార్హం. ఇప్పుడు మరో సీనియర్ నటి మృతి చెందారు. మలయాళ ప్రముఖ నటి కవియూర్ పొన్నమ్మ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు 79 సంవత్సరాలు. కొన్ని నెలలుగా వయోభారంతో బాధపడుతున్న ఆమె.. ఆసుపత్రిలో చేరారు.

vetaran actress

వృద్ధాప్య సంబంధిత సమస్యలు రావడంతో కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు పొన్నమ్మ. టాలీవుడ్‌కు తల్లి పాత్రలంటే గుర్తుకు వచ్చేది అన్నపూర్ణమ్మ. అలా మలయాళ ఇండస్ట్రీలో అమ్మ పాత్రలకు ప్రసిద్ది చెందారు పొన్నమ్మ. 1958 నుండి ఆమె సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మాలీవుడ్ స్టార్ హీరోలు సత్యన్, మధు, ప్రేమ్ నజీర్, సోమన్, సుకుమారన్, మమ్ముట్టి ,మోహన్‌లాల్ వరకు మలయాళ ఇండస్ట్రీలోని ఆల్మోస్ట్ అందరి నటులకు తల్లిగా యాక్ట్ చేశారు ఆవిడ. అంటే ఆమె అరవై సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమకు విశిష్టమైన సేవలు అందించారు. గాయనిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె..తొలుత థియేటర్ ఆర్టిస్ట్. అక్కడ నుండి నటన వైపుగా వచ్చారు. దాదాపు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు పొన్నమ్మ.

ఆమె కేవలం నటి మాత్రమే కాదు.. సీరియల్ యాక్టర్ కూడా. 25 టీవీ సీరియల్స్‌లో నటించారు. అలాగే ఓ చిత్రాన్ని కూడా నిర్మించారు పొన్నమ్మ. ఆమె మృతికి మలయాళ సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. ఆమె మరణం పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తల్లి పాత్రల ద్వారా మలయాళీ హృదయాలను గెలుచుకున్న కవియూర్ పొన్నమ్మకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామంటూ ముఖ్యమంత్రి కార్యాయలయం తెలిపింది. ఇక ఆమె అంత్యక్రియులు ఆదివారం జరగనున్నాయి. కలమససేరి మున్సిపల్ టౌన్ హాల్‌లో ప్రేక్షకుల సందర్శనార్థం ఉంచుతారు. ఆమె భర్త ఎంకె మణి స్వామి గతంలోనే మరణించారు. వీరికి పాప బిందు ఉంది. ఆమె అమెరికాలో సెటిల్ అయినట్లు తెలుస్తుంది.