P Krishna
K Shivaram Passed away: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, మాజీ ఐఏఎస్ అధికారి కన్నుమూశారు.
K Shivaram Passed away: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, మాజీ ఐఏఎస్ అధికారి కన్నుమూశారు.
P Krishna
ఇటీవల సినీ ఇండస్ట్రీని వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. సినీతారలు, దర్శక, నిర్మాతలు, ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో తీవ్ర విషాదం నెలకొంటుంది. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు కన్నుమూయడంతో అభిమానులు దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు. హార్ట్ ఎటాక్, వయోభారం, రోడ్డు ప్రమాదాలు కొన్నైతే.. ఇండస్ట్రీలో కెరీర్ సరిగా లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల డిప్రేషన్ లోకి వెళ్లి కొంతమంది సెలబ్రెటీలు ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. ప్రముఖ నటుడు, మాజీ ఐఏఎస్ అధికారి కన్నుమూయడంతో కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కన్నడ ఇంబస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు, మాజీ ఐఏఎస్ అధికారి కె శివరామ్ (71) కన్నుమూశారు. గత కొంత కాలంగా గుండె, ఇతర అనారోగ్య సమస్యలతో బెంగుళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన 1953 ఏప్రిల్ 6వ తేదీన రామనగర జిల్లాలోని ఉరగల్లిలో జన్మించారు. తండ్రి కె కెంపయ్య నాటకాలు వేస్తూ ఉండేవారు. ప్రాథమిక విద్య మొత్తం స్వగ్రామంలోనే జరిగింది. ఉన్నత విద్య కోసం బెంగుళరులోని మల్లేశ్వరం ప్రభుత్వం పాఠశాలలో అభ్యసించారు. 1972 లో టైపింగ్, షార్ట్ హ్యాండ్ కోర్సు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది.
1973 లో ఇండియన్ క్రిమినల్ ఇన్వేస్టిగేషన్ శాఖలో పోలీస్ రిపోర్టర్ గా పనిచేశారు. ఆ సర్వీస్ లో ఉండగానే వీవీపురం నైట్ కాలేజ్ లో బీఏ పూర్తి చేసి.. మైసూర్ ఓపెన్ యూనివర్సిటీలో హిస్టరీలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఇలా ఓ వైపు ఉద్యోగాలు చేస్తూనే మరోవైపు ఉన్నత విద్యనభ్యసిస్తూ వచ్చారు శివరామ్. 1985లో కేఏఎస్ పరీక్షలో పాస్ అయి.. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేశారు. 1986లో ఆయన కర్ణాటక అడ్మినిస్ట్రేటీవ్ సర్వీస్ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పోస్ట్ వచ్చింది. మొత్తానికి తన చిన్ననాటి కల ఐఏఎస్ పదవిని పొందారు. భారత దేశంలో కన్నడ భాషలో మొదట ఐఏఎస్ పరీక్ష రాసిన మొదటి వ్యక్తి శివరామ్ కావడం విశేషం. ఉద్యోగాలు చేస్తూనే తన తాత.. తండ్రుల నుంచి వచ్చిన కళను కొనసాగిస్తూ వచ్చారు. కన్నడ నాట పలు చిత్రాల్లో నటించారు. నాగతిహళ్లి చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బానల్లే మూవీలో మధు చంద్రక నటించింది. ఆ తర్వాత యారిగే బేడే దుడ్డు, ప్రేమ కోసం ఆట, టైగర్, నాగ, ఖల్నాయక్, ఓ ప్రేమ దేవత లాంటి సినిమాల్లో నటించారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ నేతలు, సినీ సెలబ్రెటీలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.