iDreamPost
android-app
ios-app

Anjana Bhowmick: ఇండస్ట్రీలో విషాదం..సీనియర్ హీరోయిన్ కన్నుమూత!

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితమే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ భార్య రూహి అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషాద ఘటన మరుక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితమే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ భార్య రూహి అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషాద ఘటన మరుక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.

Anjana Bhowmick: ఇండస్ట్రీలో విషాదం..సీనియర్ హీరోయిన్ కన్నుమూత!

మరణం అనేది ప్రతి మనిషికి తప్పనిసరిగా వచ్చేదే. నిత్యం ఎంతో మంది వివిధ కారణాలతో మరణిస్తుంటారు. కానీ.. మనకు సినీ, రాజకీయ, ఇతర ప్రముఖలకు సంబంధించిన మరణ వార్తలు మాత్రమే కనిపిస్తుంటాయి. ఇటీవల కాలంలో  సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు మరణిస్తున్నారు. ఆత్మహత్య, గుండెపోటు, అనారోగ్య సమస్య వంటి కారణాలతో కన్నుమూస్తున్నారు. అలా ప్రముఖల మరణాలు వారి కుటుంబాలతో పాటు అభిమానులను విషాదంలో ముంచేస్తున్నాయి. రెండు రోజుల క్రితం ప్రముఖ సినిమాటో గ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ భార్య రూహి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది.

ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ సతీమణి అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మృతితో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. పలువురు సెలబ్రిటీలు ఆమె మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆమె మరణం జరిగి రెండు రోజులు గడవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్‌ హీరోయిన్‌ అంజనా భౌమిక్‌(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అంజనా భౌమిక్ శ్వాసకోస సమస్యతో బాధ పడుతున్నారు.

ఈక్రమంలోనే  ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. శనివారం అంజనా ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. అంజనా భౌమిక్ అసలు పేరు ఆరతి. కూచ్‌ బిహార్‌లో ఆమె జన్మించారు. చదువు కోసం కోల్‌కతా వెళ్లిన ఆమె అక్కడే  స్థిరపడి పోయారు.  సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అంజనా ‘అనుస్టూప్ ఛంద’ అనే చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ‘థానా థేకే అస్చీ’ బెంగాలీ చిత్రంలో స్టార్‌ డమ్ పొందిన ఆమెకు  ఆ తరువాత వరుస సినిమాల ఆఫర్లు వచ్చాయి. ‘కహోనా మేఘ్‌’, ‘థానా థేకే అస్చీ’, ‘చౌరంగీ’ లాంటి క్లాసిక్‌ సినిమాల్లో నటించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు అంజనా భౌమిక్‌. అప్పట్లో అంజనా అందానికి, నటనకు యువత ఫిదా అయ్యారు.

అంజనా భౌమిక్ కు అప్పటి తరం యువతలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే వారందరిని బాధ పెడుతూ.. నావీ అధికారి అయిన అనిల్ శర్మను వివాహం చేసుకుని సినిమాకు దూరమయ్యారు. ఇక సినీ ఇండస్ట్రీలో ఆమె కృషి పలు అవార్డులు సైతం వరించాయి. 2012లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. అంజనాకు నీలాంజనా సేనాగుప్తా, చందనా శర్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నీలాంజనా ప్రముఖ యాక్టర్ జిష్షు సేన్‌గుప్తాను వివాహం చేసుకుంది. అంజనా మృతిపట్ల బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. అలానే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరి.. సీనియర్ హీరోయిన్ మృతిపట్ల మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetgaranti girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetcasibomGrandpashabet Girişgrandpashabet giriş