కేజీఎఫ్‌ వివాదంపై మరోసారి స్పందించిన వెంకటేష్‌ మహా!

ఓ సినిమా పేరు చెప్పను కానీ, వివరాలు చెప్తాను. ప్రపంచంలో ఏ తల్లి అయినా కొడుకుని గొప్పోడివి అవ్వాలిరా అని చెప్తుంది. కానీ, ఆ సినిమాలో...

ఓ సినిమా పేరు చెప్పను కానీ, వివరాలు చెప్తాను. ప్రపంచంలో ఏ తల్లి అయినా కొడుకుని గొప్పోడివి అవ్వాలిరా అని చెప్తుంది. కానీ, ఆ సినిమాలో...

‘కేరాఫ్‌ కంచెర పాలెం’ సినిమాతో తెలుగు నాట దర్శకుడిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వెంకటేష్‌ మహా. తీసింది తక్కువ సినిమాలే అయినా యువ దర్శకుడిగా ఆయనకు ఓ రేంజ్‌లో క్రేజ్‌ ఉంది. అయితే, గత కొన్నేళ్లనుంచి ఆయన దర్శకుడిగా సినిమాలు తీయటం తగ్గించేశారు. నటుడిగా.. రచయితగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం ఓ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న ఆయన కేజీఎఫ్‌ సినిమాపై సంచలన కామెంట్లు చేశారు.

‘‘ ఓ సినిమా పేరు చెప్పను కానీ, వివరాలు చెప్తాను. ప్రపంచంలో ఏ తల్లి అయినా కొడుకుని గొప్పోడివి అవ్వాలిరా అని చెప్తుంది. కానీ, ఆ సినిమాలో తల్లి ఓ పెద్ద వస్తువు కావాలంటుంది. హీరో దాన్ని తవ్వే వాళ్లను ఉద్దరిస్తాడు. ఆ బంగారం తీసుకెళ్లి ఎక్కడో పారదొబ్బుతాడు. వాడంత పిచ్చోడు ఎవడైనా ఉన్నాడా? ఆ మహాతల్లి నిజంగా ఉంటే ఆమెను కలవాలని ఉంది. ఇలాంటి కథను సినిమా తీస్తే చప్పట్లు కొడుతున్నాం’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియా వ్యాప్తంగా పెను దుమారం రేపాయి. వెంకటేష్‌ మహాపై ట్రోలింగ్స్‌ వచ్చాయి. దీంతో ఆయన స్పందించి క్లారిటీ ఇచ్చారు.

తాజాగా మరో సారి ఆయన కేజీఎఫ్‌ సినిమాపై చేసిన కామెంట్లపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ కమర్షియల్‌ సినిమాలు చూస్తూ పెరిగా.. ఒక పక్క బారతీరాజా గారు.. కే విశ్వనాథ్‌ గారు… బాల చందర్‌ గారి సినిమాలు చూస్తుండగానే.. థియేటర్లలో రోజు వారి కమర్షియల్‌ సినిమాలు చూస్తూ పెరిగాను. ఏ రోజు నా నోటి వెంబట కమర్షియల్‌ సినిమాలు చేయను అని చెప్పలేదు. నామీద ఎందుకలా అభిప్రాయం ఏర్పడిందో తెలీదు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను.

ఓ డైరెక్టర్‌ గురించి కానీ, ఓ నటుడి గురించి కానీ, అసలు ఆ సినిమా గురించి కూడా కాదు టాపిక్‌ ఆ రోజు జరుగుతున్నది. కమర్షియల్‌ సినిమా అని కూడా కాదు. వేరే ఏదో టాపిక్‌ మధ్యలో నాకు హార్స్‌గా.. మీరు ఇంటర్వ్యూ మొదట్లో చూస్తే నేను చాలా నిదానంగా.. ఉన్న టాపిక్‌ మీద మాట్లాడుతున్నాను. మధ్యలో చాలా హార్స్‌ కన్‌వర్‌జేషన్‌ జరిగింది. అదంతా ఎడిట్‌లో లేదు. నేను ఓ ప్రశ్న సంధించే స్పేస్‌లో ఆ సంభాషణ జరిగింది’’ అని అన్నారు.

Show comments