iDreamPost
android-app
ios-app

మెగా ఫ్యాన్స్ కి షాక్.. వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ ఆగిపోయిందా?

  • Published Feb 14, 2024 | 8:22 PM Updated Updated Feb 14, 2024 | 8:22 PM

Matka On Hold: వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ విషయంలో ఫ్యాన్స్ కి షాక్ తగిలేలా ఉంది. ఈ మూవీ ఆగిపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి.

Matka On Hold: వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ విషయంలో ఫ్యాన్స్ కి షాక్ తగిలేలా ఉంది. ఈ మూవీ ఆగిపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి.

  • Published Feb 14, 2024 | 8:22 PMUpdated Feb 14, 2024 | 8:22 PM
మెగా ఫ్యాన్స్ కి షాక్.. వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ ఆగిపోయిందా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ నిజానికి ఫిబ్రవరి 16న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం అవ్వడం కారణంగా మార్చి 1కి విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయిపోయిన సందర్భంగా మెగా ఫ్యాన్స్ వరుణ్ నెక్ట్స్ చిత్రం గురించి ఆరా తీయడం ప్రారంభించారు. అయితే వారికి ఒక షాకింగ్ వార్త ఎదురైంది. వరుణ్ తేజ్ తొలిసారి పాన్ ఇండియా హీరోగా రాబోతున్న మట్కా చిత్రం ఆగిపోయింది అంటూ వార్తలు వైరల్ అవతున్నాయి. అసలు ఆ వార్తలు ఎందుకు వస్తున్నాయో చూద్దాం.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత తన పాన్ ఇండియా మూవీ మట్కా పట్టాలు ఎక్కాల్సి ఉంది. ఇది వరుణ్ తేజ్ కెరీర్ లో 14వ చిత్రం. ఈ మూవీని వైరా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై పలాస ఫేమ్ డైరెక్టర్ కరుణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఇది వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీగా చెప్తున్నారు. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో వరుణ్ తేజ్ ప్రామిస్ చేయబోతున్నాడు. కానీ, ఈ మూవీ ఆగిపోయింది అనే వార్తలు జోరందుకున్నాయి. అయితే ఇది మొత్తానికి ఆగిపోలేదని చెబుతున్నారు. ప్రస్తుతానికి బడ్జెట్ ఇబ్బందుల దృష్ట్యా సినిమాని హోల్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఇబ్బందులను అధిగమించి ఎలా మళ్లీ ప్రాజెక్టును పట్టాలు ఎక్కించాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారంట.

బడ్జెట్ చేతులు దాటిపోయే ప్రమాదం ఉందని.. కాస్ట్ కటింగ్ పై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. మరోవైపు వరుణ్ తేజ్ ని కూడా తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని నిర్మాతలు రిక్వెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ బడ్జెట్ ఇష్యూస్ నేపథ్యంలోనే ఫిబ్రవరి, మార్చిలో జరగాల్సిన షెడ్యూల్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారంట. ఈ మూవీ అయితే యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నామంటూ డైరెక్టర్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఓపెనింగ్ బ్రాకెట్ అంటూ ఒక టైటిల్ గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ వరుణ్ ని కేవలం సైడ్ నుంచి మాత్రమే రివీల్ చేశారు. కానీ.. లుక్స్, స్టోరీ లైన్ మాత్రం ఎంతో ప్రామిసింగ్ గా ఉంది.

ఒక ఇల్లీగల దందా నేపథ్యంలో వస్తున్న చిత్రం కావడం, యదార్థ ఘటనల ఆధారంగా అనడంతోనే ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పైగా పాన్ ఇండియా సినిమా కూడా కావడంతో వరుణ్ తేజ్ కూడా ఈ మూవీపై గట్టిగానే అంచనాలు పెట్టుకున్నాడు. మరి.. ఈ వార్తల్లో నిజమెంత? నిజంగానే మట్కా చిత్రం ఆగిపోయిందా? అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు చెప్పే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి వరుణ్ తేజ్ మాత్రం ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంతో బాలీవుడ్ లో మంచి విజయం నమోదు చేస్తానంటూ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి.. మట్కా చిత్రం ఆగిపోయింది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio