iDreamPost
android-app
ios-app

ఆసక్తికరంగా వరుణ్‌ తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ టీజర్‌!

  • Published Dec 18, 2023 | 5:55 PM Updated Updated Dec 18, 2023 | 5:55 PM

వరుణ్‌ తాజాగా ‘ గాంఢీవ ధారి అర్జున’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ‘‘ ఆపరేషన్‌ వాలెంటైన్‌’’ అనే మూవీలో నటిస్తున్నారు. ఇది తెలుగు, హిందీ బైలింగువల్‌ చిత్రంగా తెరకెక్కుతోంది.

వరుణ్‌ తాజాగా ‘ గాంఢీవ ధారి అర్జున’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ‘‘ ఆపరేషన్‌ వాలెంటైన్‌’’ అనే మూవీలో నటిస్తున్నారు. ఇది తెలుగు, హిందీ బైలింగువల్‌ చిత్రంగా తెరకెక్కుతోంది.

  • Published Dec 18, 2023 | 5:55 PMUpdated Dec 18, 2023 | 5:55 PM
ఆసక్తికరంగా వరుణ్‌ తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ టీజర్‌!

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలో ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఈ మూవీతో వరుణ్‌ తేజ్‌ హిందీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మేజర్‌ సినిమాను తెరకెక్కించిన నిర్మాణ సంస్థే ‘‘ ఆపరేషన్‌ వాలెంటైన్‌ను తెరకెక్కిస్తోంది. ఈ మూవీలో వరుణ్‌ తేజ్‌ సరసన మానుషీ చిల్లర్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

దేశ భద్రతలో భాగమైన నావీ పోరాటాల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఇక, ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రానికి సంబంధించి సోమవారం ఓ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. మూవీ టీజర్‌ విడుదలైంది. 1.27 నిమిషాల నిడివి కలిగిన ఈ టీజర్‌ ఎంతో ఆసక్తికరంగా ఉంది. నావీ అధికారిగా వరుణ్‌ తేజ్‌ లుక్‌ అద్భుతంగా ఉంది. ప్రాణాలకు తెగించి దేశ భద్రత కోసం పోరాడే నావీ అధికారిగా వరుణ్‌ కనిపించనున్నారు. ఈ టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. 

కాగా, వరుణ్‌ తేజ్‌ గత కొంత కాలంనుంచి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నారు. ప్రయోగాలకు పెద్ద పీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గద్దల కొండ గణేష్‌, ఘనీ, గాంఢీవ ధారి అర్జున సినిమాలు చేశారు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’కు ఓకే చెప్పారు. ఈ సినిమా తర్వాత మట్కా అనే సినిమాలో నటించనున్నారు. ఇప్పిటికే టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ జరిగిపోయింది. ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

ఇక, వరుణ్‌ తేజ్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే.. నవంబర్‌ 1వ తేదీన ఆయన పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. సహ నటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నవంబర్‌ 1, 2023న వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లికి దాదాపు ఐదేళ్ల ముందునుంచే ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉన్నారు. 2017లో వచ్చిన మిస్టర్‌ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. ఈ సమయంలోనే వీరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా తర్వాతి కాలంలో ప్రేమగా మారింది. ఇద్దరూ తమ ప్రేమ విషయం పెద్దలకు చెప్పారు.

పెద్దల అంగీకారంతో నవంబర్‌లో ఒక్కటయ్యారు. ఇటలీలో పెళ్లి జరగ్గా.. హైదరాబాద్‌లో పెళ్లి రిసెస్పన్‌ జరిగింది. అక్కడ పెళ్లికి వెళ్లలేని వాళ్లు… రిసెస్పన్‌కు వెళ్లారు. పెళ్లి కోసం వరుణ్‌ తేజ్‌ కొంత కాలం మూవీ షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ షూటింగుల్లో పాల్గొంటున్నారు. మరి, వరుణ్‌ తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ టీజర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibom