iDreamPost
android-app
ios-app

అఫీషియల్: వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ ఆరోజే!

  • Published Feb 03, 2024 | 5:29 PM Updated Updated Feb 03, 2024 | 5:37 PM

Operation Valentine New Release Date: వరుణ్ తేజ్ హిందీ డెబ్యూ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఆ చిత్రం మాత్రం వాయిదాలు పడుతోంది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

Operation Valentine New Release Date: వరుణ్ తేజ్ హిందీ డెబ్యూ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఆ చిత్రం మాత్రం వాయిదాలు పడుతోంది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

  • Published Feb 03, 2024 | 5:29 PMUpdated Feb 03, 2024 | 5:37 PM
అఫీషియల్: వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ ఆరోజే!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  ప్రస్తుతం అటు ఫ్యామిలీ లైఫ్ ని.. ఇటు కెరీర్ ని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు టాలీవుడ్ కే పరిమితమైన ఈ యంగ్ హీరో ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాపై అటు మెగా ఫ్యాన్స్ లో కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలోనే గందరగోళ నెలకొంటోంది. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. నిజానికి ఫిబ్రవరి 16న విడుదల కావల్సిన చిత్రం ఇది. కానీ, వాయిదా వేస్తున్న వార్తలు వచ్చాయి. అభిమానులు కూడా తీవ్ర నిరాశ పడ్డారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ అందింది.

వరుణ్ తేజ్ సినిమా అంటే టాలీవుడ్ అభిమానుల్లో మినిమం ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆపరషన్ వాలెంటైన్ హిందీలో కూడా వస్తున్న నేపథ్యంలో బీ టౌన్ లో కూడా వరుణ్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ, అంచనాలు పెరిగే కొద్దీ ఈ సినిమా రిలీజ్ వెనక్కి వెళ్తూ వస్తోంది. తాజాగా ఫిబ్రవరి 16న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అధికారికంగా ప్రకటించడమే కాకుండా.. ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. వరుణ్ తేజ్ రియల్ లైఫ్ వింగ్ కమాండర్ మైనేని శ్రీనాథ్ ని ఇంటర్వ్యూ కూడా చేశాడు. కానీ, అనుకున్న తేదీకి ఆపరేషన్ వాలంటైన్ రాలేకపోతున్న విషయాన్ని వెల్లడించారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా విడుదలను వాయిదా వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కొత్త రిలీజ్ డేట్ ఏంటి అని ఫ్యాన్స్ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఎప్పుడెప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ అవుతుందని ఎదురుచూపులు మొదలు పెట్టారు.

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ కోసం ఎదురుచూసే వారికి టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆపరేషన్ వాలెంటైన్ అధికారిక రిలీజ్ డేట్ ని ప్రకటించారు. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం అంటూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అందుకు సంబందించిన రిలీజ్ డేట్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఈ కథను యాదార్థ కధల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహిచాడు. ఈ మూవీలో వరుణ్ తేజ్ వింగ్ కమాండర్ గా కనిపించబోతున్నాడు. శత్రుదేశాల మీద చేసే సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. టీజర్ చూసిన తర్వాత ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సాధారణంగానే ఇలాంటి యాక్షన్ డ్రామాలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. పైగా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి అటు బాలీవుడ్ లో కూడా అంచనాలు భారీగానే నెలకొన్నాయి. మరి.. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom