iDreamPost
android-app
ios-app

మెగా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ వాయిదా!

  • Published Jan 31, 2024 | 7:25 PM Updated Updated Jan 31, 2024 | 7:25 PM

Operation Valentine Postponed: వరుణ్ తేజ్- మానుషీ చిల్లర్ జంటగా వస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ఫిబ్రవరి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, చెప్పిన తేదీకి వచ్చే పరిస్థితి ఉందా?

Operation Valentine Postponed: వరుణ్ తేజ్- మానుషీ చిల్లర్ జంటగా వస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ఫిబ్రవరి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, చెప్పిన తేదీకి వచ్చే పరిస్థితి ఉందా?

  • Published Jan 31, 2024 | 7:25 PMUpdated Jan 31, 2024 | 7:25 PM
మెగా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ వాయిదా!

ప్రస్తుతం సినిమాల రిలీజ్ డేట్ల కంటే కూడా వాయిదాల గురించే ఎక్కువగా మాట్లాడుకునే పరిస్థితి కనిపిస్తోంది. చెప్పిన తేదీకి సినిమాని రిలీజ్ చేయడం అంటే ఒక మహాయజ్ఞంలాగే కనిపిస్తోంది. ఈ మధ్య చిన్న సినిమాల నుంచి బడా హీరోల సినిమాల వరకు అందరి పరిస్థితి ఇలాగే ఉంది. సినిమాని కనీసం ఒక్కసారైనా వాయిదా వేయాల్సి వస్తోంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు ఈ చిత్రాల వాయిదాలకు కూడా అన్నే కారణాలు ఉంటున్నాయి. అది స్వయంకృతాపరాధం కావచ్చు.. పక్క సినిమాలతో నెలకొన్న పోటీ కావచ్చు.. పరిశ్రమ పెద్దల నుంచి వచ్చే విన్నపాలు కావచ్చు.. ఇలా కారణం ఏదైనా సినిమాల వాయిదాల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ జాబితాలోకి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ కూడా చేరింది.

వరుణ్ తేజ్- మానుషీ చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శవకత్వంలో వస్తున్న చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ మూవీని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినై సెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న సినీ లవర్స్ కి మాత్రం ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ వాయిదా పడిందంటూ టాలీవుడ్ లో టాక్ స్టార్ట్ అయ్యింది. మొదట ఈ సినిమాని ఫిబ్రవరి 16న విడుదల చేయాలి అనుకున్నారు. టీజర్ రిలీజ్ సమయంలో కూడా అధికారికంగా ఆ తేదీనే ప్రకటించారు.

ఇప్పుడు గ్రాఫిక్స్ విషయంలో సమస్య తలెత్తడం వల్ల మూవీ రిలీజ్ ని వాయిదా వేసేందుకు టీమ్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో గానీ మార్చి మొదటి వారంలో గానీ విడుదల చేస్తారని చెబుతున్నారు. ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడితే సందీప్ కిషన్- వర్షా బొల్లమ్మ నటించిన ఊరు పేరు భైరవకోన మూవీకి ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలి అనుకున్న ఈ మూవీని.. ఫిల్మ్ ఛాంబర్ రిక్వెస్ట్ మేరకు ఫిబ్రవరి 16కు మార్చుకున్నారు. వరుణ్ తేజ్ సినిమా ఉండటంతో వారికి కూడా ఎక్కడో ఒకచోట చిన్న గుబులు ఉండే ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ వాయిదా పడితే దాదాపుగా పోటీ లేకుండానే రిలీజే చేస్తున్నట్లు అవుతుంది. వరుణ్ తేజ్ మూవీ వాయిదా పడితే సందీప్ కిషన్ కలిసొస్తుంది.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా విషయానికి వస్తే.. నెలక్రితమే ఈ మూవీ టీమ్ ఫస్ట్ స్ట్రైక్ పేరిట టీజర్ ని రిలీజ్ చేసింది. ఆ టీజర్ చూసిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. యదార్థ సంఘటనల ఆధారంగా అంటూ చెప్పడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో.. ఎయిర్ స్ట్రైక్స్ కి సంబంధించి ఈ మూవీ ఉండబోతోంది అని అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఫైటర్ జెట్లు, ఉగ్రవాదులతో పోరాట సన్నివేశాలు చాలానే కనిపిస్తున్నాయి. ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అర్జున్ దేవ్ గా వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో కావాల్సినంత యాక్షన్, కావాల్సినంత డ్రామా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. ఆలస్యం అయినా కూడా మరింత వేగంగా విడుదల చేస్తారేమో చూడాలి. మరి.. ఆపరేషన్ వాలెంటైన్ వాయిదా పడింది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet