iDreamPost
android-app
ios-app

మెగా హీరోలకి హిట్స్ లేవుగా! వరుణ్ తేజ్ కి రిపోర్టర్ షాకింగ్ క్వశ్చన్!

  • Published Feb 20, 2024 | 5:38 PM Updated Updated Feb 20, 2024 | 6:34 PM

Varun Tej On Mega Heroes Movies: వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రమోషన్స్ కోసం తెగ కష్టపడి పోతున్నాడు. ఈ మూవీ కచ్చితంగా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాడు.

Varun Tej On Mega Heroes Movies: వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రమోషన్స్ కోసం తెగ కష్టపడి పోతున్నాడు. ఈ మూవీ కచ్చితంగా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాడు.

  • Published Feb 20, 2024 | 5:38 PMUpdated Feb 20, 2024 | 6:34 PM
మెగా హీరోలకి హిట్స్ లేవుగా! వరుణ్ తేజ్ కి రిపోర్టర్ షాకింగ్ క్వశ్చన్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ మూవీ కోసం ప్రమోషన్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఈ మూవీ హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పాన్ ఇండియా లెవల్లో ప్రమోషన్స్ చేయాల్సి వస్తోంది. ఇప్పటికే నార్త్ లో కొన్ని ప్రచార కార్యక్రమాలు చేసిన వరుణ్ తేజ్.. ప్రస్తుతం తెలుగులో మూవీని ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అభిమానులతో చిట్ చాట్ కూడా నిర్వహించాడు. తాజాగా మీడియాతో కూడా మాటా మంతి కార్యక్రమం నిర్వహించాడు. కానీ, ఈ సందర్భంగా వరుణ్ కు రిపోర్టర్ నుంచి ఒక షాకింగ్ ప్రశ్న ఎదురైంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం వాలెంటైన్ చిత్రం మీద తన ఫోకస్ పెట్టాడు. ఈ మూవీ ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో రియల్ లైఫ్ ఈవెంట్స్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఇప్పటికే ఈ కాన్సెప్ట్ తో వచ్చిన ఫైటర్ వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ కూడా అదే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని టీమ్ గట్టిగా నమ్ముతోంది. వరుణ్ తేజ్ కూడా ఈ మూవీపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. ఇప్పటికే గాంఢీవదారి అర్జున మూవీకి ఆశించిన ఫలితం రాలేదు. ఈ చిత్రంతో మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని వరుణ్ భావిస్తున్నాడు. ఇలాంటి ఊహించని ప్రశ్నే రిపోర్టర్ నుంచి వరుణ్ తేజ్ కు ఎదురైంది.

మెగా హీరోల నుంచి వచ్చిన చిత్రాలు అంత ఆశాజనకంగా లేవు. ఈ మూవీ మెగా ఫ్యాన్స్ ఆకలి తీరుస్తుందా అంటూ రోపర్టర్ వరుణ్ తేజ్ ను ప్రశ్నించాడు. అందుకు వరుణ్ ఇలా రియాక్ట్ అయ్యాడు.. “మెగా హీరోలనే కాదు ఎవరికైనా ఒక సంవత్సరం డల్ గా ఉండచ్చు. ఎవరి కెరీర్ లోనైనా అది జరుగుతుంది. కానీ, ఒక సంవత్సరం డల్ గా ఉంటే నెక్ట్స్ ఇయర్ కచ్చితంగా పికప్ అవుతాం. గత 30, 40 ఏళ్లుగా మీరు అది చూస్తూనే ఉన్నారు. నాకు రెండు సినిమాలు పోయాయి. ఈ మూవీ కోసం మేము ఎంతో కష్టపడ్డాం. ఈ మూవీ సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ మూవీని మీరు అదే స్థాయిలో ఆదరిస్తారని కూడా నమ్ముతున్నాను” అంటూ వరుణ్ తేజ్ రిపోర్టర్ ప్రశ్నకు సమాధానం చెప్పాడు.

ఈ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ విషయానికి వస్తే.. మంగళవారం ఫైనల్ స్ట్రైక్ అంటూ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తరవాత సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఆ విజువల్స్, గాలిలో విన్యాసాలు, ఎయిర్ లోనే యాక్షన్ సీక్వెన్స్ లు పెట్టడం అందరినీ అబ్బుర పరుస్తోంది. ఈ మూవీతో వరుణ్ తేజ్ హిట్టు కొడతాడు అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 16న రావాల్సిన చిత్రాన్ని వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కానందున.. మార్చి 1కి వాయిదా వేశారు. ఇప్పుడు మార్చి 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు ఆపరేషన్ వాలెంటైన్ మూవీ రెడీ అవుతోంది. మరి.. మెగా హీరోల చిత్రాలకు సంబంధించి వరుణ్ తేజ్ చెప్పిన సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom