iDreamPost
android-app
ios-app

స్పీడ్ పెంచిన వరుణ్ తేజ్.. ఇంట్రెస్టింగ్ టైటిల్ తో మరో పాన్ ఇండియా మూవీ!

  • Author Soma Sekhar Published - 05:15 PM, Thu - 27 July 23
  • Author Soma Sekhar Published - 05:15 PM, Thu - 27 July 23
స్పీడ్ పెంచిన వరుణ్ తేజ్.. ఇంట్రెస్టింగ్ టైటిల్ తో మరో పాన్ ఇండియా మూవీ!

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఒక సినిమాను రిలీజ్ చేయకముందే.. మరో మూవీని అనౌన్స్ చేస్తూ.. ప్రేక్షకులకు కిక్ ఇస్తున్నారు. ఇక టాలీవుడ్ యంగ్ హీరోలు వరుసగా పాన్ ఇండియా మూవీలను పట్టాలపైకి ఎక్కిస్తూ వస్తున్నారు. ఈ వరుసలో మెగా హీరో వరుణ్ తేజ్ స్పీడ్ పెంచాడు. ఇప్పటికే ఈ మెగాప్రిన్స్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాంఢీవధారి అర్జున’ అనే పాన్ ఇండియా మూవీని కంప్లీట్ చేశాడు. ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతలోనే మరో పాన్ ఇండియా అప్ డేట్ ను ఇచ్చాడు ఈ మెగాహీరో. ఇంట్రెస్టింగ్ టైటిల్ తో కొత్త సినిమాను ప్రకటించాడు వరుణ్ తేజ్.

వరుణ్ తేజ్.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా గానీ.. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో దూసుకెళ్తున్నాడు. చేసినవి తక్కువ మూవీసే అయినా.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు పట్టాలపైకి ఎక్కిస్తూ.. ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాంఢీవధారి అర్జున’ అనే సినిమాలో నటించాడు వరుణ్ తేజ్. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతలోనే మరో పాన్ ఇండియా సినిమాను ప్రకటించాడు ఈ మెగాహీరో.

ఈ క్రమంలోనే ‘పలాస’ ఫేమ్ డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు వరుణ్. ఈ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఖరారు చేశారు మేకర్స్. వరుణ్ తేజ్ నటిస్తున్న 14వ సినిమాకు ‘మట్కా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తాజాగా ఈ చిత్రం టైటిల్ ను అనౌన్స్ చేశారు. 1975 నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. మట్కా ఆట ప్రధానంగా ఈ కథ సాగుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వరుణ్ తేజ్ కు జంటగా మీనాక్షి చౌదరి ఆడిపాడనుంది. మరి వరుస పాన్ ఇండియా చిత్రాల్లో దూసుకెళ్తున్న వరుణ్ తేజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్.. మెగాస్టార్ ఊర మాస్ పర్ఫార్మెన్స్!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom