iDreamPost
android-app
ios-app

సినిమాలో క్యారెక్టర్ కోసం హీరోయిన్ ని దూరం పెట్టిన హీరో!

  • Author Soma Sekhar Published - 12:16 PM, Sat - 15 July 23
  • Author Soma Sekhar Published - 12:16 PM, Sat - 15 July 23
సినిమాలో క్యారెక్టర్ కోసం హీరోయిన్ ని దూరం పెట్టిన హీరో!

సినిమా ఇండస్ట్రీలో రీల్ లైఫ్ లో ప్రేమకథల కంటే.. రియల్ లైఫ్ లోనే ఎక్కువగా ప్రేమ కథలు జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని ప్రేమలు డేటింగ్ తో మెుదలు అయితే.. మరికొన్ని స్నేహంతో ప్రారంభం అవుతుంటాయి. అయితే ఆ లవ్ స్టోరీస్ ఎంతకాలం కొనసాగుతాయి అన్నదే ఇక్కడ అసలు సమస్య. ఈ సమస్యలన్ని నాకెందుకు అనుకున్నాడేమో గానీ.. ఓ యువ హీరో స్టార్ హీరోయిన్ ను అవాయిడ్ చేశాడన్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ హీరో పట్టించుకోని హీరోయిన్ ఎవరో తెలుసా? బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్. మీకు ఆశ్చర్యం వేస్తుంది కదూ.. జాన్వీ లాంటి అమ్మాయి మాట కలుపుతుంటే పట్టించుకోని ఆ యంగ్ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.

జాన్వీ కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవీ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తన అందంతో నటనతో తనకంటూ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అదీకాక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్స్ వీడియోలను, ఫోటోలను అప్లోడ్ చేస్తూ.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు నటించిన చిత్రం’బవాల్’ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఈ సోయగం.

ఇక బవాల్ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తో జతకట్టింది ఈ బ్యూటీ. అయితే ఈ సినిమా సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ జరిగిందట. వీరిద్దరు జోడీ కట్టడం ఇదే మెుదటి సారి కావడంతో.. మూవీ యూనిట్ అంతా వీరు కలిసిపోవడం ఖాయం అనుకున్నారట. దాంతో పాటుగా జాన్వీ ఎప్పుడు వరుణ్ తో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉండేదట. అయితే జాన్వీ ఎంతగా ప్రయత్నించినా.. వరుణ్ మాత్రం ఆమెను పట్టించుకోకపోయేవాడట. ఇలా ఒక్కరోజు, రెండు రోజులు కాదట.. నెల రోజులు ఈ తంతు ఇలాగే కొనసాగిందని హీరోనే స్వయంగా చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలోనే వీరిద్దరు ఎంతో చలాకీగా ఉంటారు దాంతో వీరు స్నేహితులు అయితే.. అది తన నటనపై ఎఫెక్ట్ పడుతుందని వరుణ్ ధావన్ భావించాడని అందుకే జాన్వీని దూరం పెట్టాడని తెసుస్తోంది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. జాన్వీ లాంటి అందగత్తె మాట్లాడితే మాట్లాడకపోవడం ఏంటి బ్రో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి అందం మాకెళ్లి చూస్తే చాలు అనుకునే వాళ్లం చాలా మందిమి ఉన్నాం అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: డబ్బు, స్టేటస్ వస్తాయ్ పోతాయ్! నీతులు చెప్పట్లేదన్న తేజస్వి!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss