iDreamPost
android-app
ios-app

ఆటోలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ షికార్లు.. వీడియో వైరల్!

  • Published Sep 23, 2023 | 2:07 PM Updated Updated Sep 23, 2023 | 2:07 PM
  • Published Sep 23, 2023 | 2:07 PMUpdated Sep 23, 2023 | 2:07 PM
ఆటోలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ షికార్లు.. వీడియో వైరల్!

అందాల భామ కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. రామ్ హీరోగా నటించిన నేను శైలజ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన కీర్తి సురేష్ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు. ఇటీవల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా కీర్తి సురేష్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

కీర్తి సురేష్ మొన్నటి వరకు టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటిస్తూ తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. ఈ మద్యనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో జవాన్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అట్లీ మరో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రంతో కీర్తి సురేష్ మొదటిసారిగా బాలీవుడ్ తెరకు పరిచయం కాబోతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. వరుణ్ ధావన్ కి ఇది 18వ సినిమా.

ఈ మూవీ ఎలాగైనా హిట్ చేయించాలని ఇప్పటి నుంచి చిత్ర యూనిట్ ప్రమోషన్ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆటోలో కీర్తి సురేష్, వరుణ్ ధావన్ లు చక్కర్లు కొడుతున్న ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో కీర్తి సురేష్ తెగ సిగ్గు పడుతూ కనిపిస్తుంది. ఇక హీరో వరుణ్ ధావన్ బనియన్ వేసుకొని కనిపిస్తున్నాడు. సినిమా షూటింగ్ దశలో ఉండగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేయడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Snehkumar Zala (@snehzala)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş