iDreamPost
iDreamPost
కేవలం నలభై రోజుల్లో సంక్రాంతి భీకర బాక్సాఫీస్ యుద్ధం మొదలుకాబోతోంది. ఆది పురుష్ తప్పుకున్నప్పటికీ పోటీ మాత్రం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో థియేటర్ల కోసం నిర్మాతలు నువ్వా నేనా అంటూ తలపడుతున్నారు. వారసుడు కోసం దిల్ రాజు ఎక్కువగా లాక్ చేస్తున్నారన్న విమర్శలకు స్పష్టమైన సమాధానం దొరకలేదు కానీ మరోవైపు ఎవరి పని వాళ్ళు చేసేసుకుంటున్నారు. తాజాగా రిలీజ్ డేట్లను కన్ఫర్మ్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం వెళ్ళిపోతోంది. విజయ్ వారసుడు జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. అదే రోజు అజిత్ తునివు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్క్రీన్ల ఇబ్బంది రాకుండా ఇలా ప్లాన్ చేశారట.
వీరసింహారెడ్డిని 12నే బరిలో దింపబోతున్నారు. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కానీ అంతర్గతంగా డిసైడ్ చేశారట. వాల్తేర్ వీరయ్య దీనికన్నా ఒక రోజు ఆలస్యంగా 13న రిలీజ్ చేయబోతున్నట్టు ఇన్ సైడ్ న్యూస్. జనవరి 8/10 ఆప్షన్లను పరిశీలించినప్పటికీ ముందుగా రావడం వల్ల ఎంతైతే లాభం ఉందో అంతే స్థాయిలో ఇబ్బంది కూడా ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయలేదనే మాట వినిపిస్తోంది.
ఇవి కాకుండా మరో మీడియం బడ్జెట్ మూవీ ప్లానింగ్ లో ఉందట. కొన్నేళ్ల క్రితం ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్రశాతకర్ణి, శతమానంభవతిలు తలపడినప్పుడు ఆర్ నారాయణమూర్తి తన హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్యని రిలీజ్ చేశారు.
ఇప్పుడలా ఎవరైనా సాహసం చేస్తారేమో చూడాలి. ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయిన నాలుగు సినిమాలు చూస్తే సుమారు నాలుగు వందల కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ ని టార్గెట్ చేసుకున్నాయి. తెలుగులో చిరు బాలయ్యలదే డామినేషన్ అయినప్పటికీ వారసుడు నిర్మాత దర్శకుడు తెలుగువారు కావడంతో వల్ల అందులో కంటెంట్ మనవాళ్లకూ కనెక్ట్ అవుతుందన్న నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. తునీవు ఎలాంటి సౌండ్ చేయకుండా ప్రమోషన్లకు దూరంగా ఉండగా వాల్తేర్ వీరయ్య బాస్ పార్టీ యూట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా దూసుకుపోతోంది. దానివెనుక తమన్ స్వరపరిచిన జైబాలయ్య సైతం పది మిలియన్లు దాటేసి గట్టి పోటీ ఇస్తోంది.