iDreamPost
android-app
ios-app

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పెళ్లి వీడియో వైరల్‌.. పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో చూశారా

  • Published Jul 12, 2024 | 2:57 PMUpdated Jul 12, 2024 | 2:57 PM

Varalakshmi Sharath Kumar: తాజాగా కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తాను ప్రేమించిన వ్యక్తి ప్రముఖ ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌తో ఏడడుగులు వేసింది. కాగా, వీరి వివాహం దక్షిణ సంప్రదాయ పద్ధతిలో ఈనెల 10వ తేదీన ధాయ్ లాండ్ లోని ఒక బీచ్ రిసార్ట్ లో జరిగింది. అయితే ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

‘వరలక్ష్మీ శరత్ కుమార్’.. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే.. పేరుకు కోలీవుడ్ నటి అయిన ఈ అమ్మడు తెలుగులోనే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా తండ్రి వారసత్వంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా విభన్న పాత్రలు పోషిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో వరుస సినిమాల్లో అలరిస్తూ బిజీగా మారిపోయింది అమ్మడు. ఇదిలా ఉంటే.. వరలక్ష్మీ నికోలయ్ సచ్ దేవ్ ను అనే వ్యక్తిని ప్రేమించిన విషయం తెలిసిందే. కాగా, వీరిద్దరికి ఈ ఏడాది మార్చి 2వ తేదీన ఘనంగా ముంబయిలో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇక ఈ వేడకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు కూడా హాజరైయ్యారు. ఇకపోతే తాజాగా ఈ ప్రేమ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కాగా, అందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోలు సోషల్  మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తాను ప్రేమించిన వ్యక్తి ప్రముఖ ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌తో ఏడడుగులు వేసింది. కాగా, వీరి వివాహం దక్షిణ సంప్రదాయ పద్ధతిలో ఈనెల 10వ తేదీన ధాయ్ లాండ్ లోని ఒక బీచ్ రిసార్ట్ లో జరిగింది. ఇక ఈ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు.  అయితే ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఫోటోలను, వీడియోలను చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ అలాగే పలువురు సినీ సెలబ్రిటీస్ ఈ జంటకు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తునే విషెస్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కుటుంబం నుంచి పెళ్లి తేదీ ఎప్పుడు అనేది అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో అందరూ వీరి వివాహం జూలై 2వతేదీన జరిగిందని భావించారు.

ఇకపోతే వరలక్ష్మీ శరత్ కుమార్, నికోలయ్ సచ్‏దేవ్‌ల రిసెప్షన్ ఈనెల 4వ తేదీన ఘనంగా చెన్నైలో జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు సినీ నటీనటులు, ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వధూవరులను ఆశీర్వదించారు.  అంతేకాకుండా.. రజనీకాంత్, బాలకృష్ణ, మంచు లక్ష్మి, సిద్ధార్థ్, ఖుష్బూ, శోభన వంటి స్టార్స్‌ ఆ రిసెప్షన్‌లో సందడి చేశారు. మరి, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వరలక్ష్మీ, నికోలాయ్ వెడ్డింగ్ ఫోటోస్, వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి