iDreamPost
android-app
ios-app

పెళ్లి కబురు చెప్పిన వరలక్ష్మి.. కాబోయేవాడి బ్యాగ్రౌండ్ ఇదే!

  • Published Mar 02, 2024 | 7:19 PM Updated Updated Mar 02, 2024 | 7:51 PM

Varalakshmi Sarathkumar Engaged: వరలక్ష్మి శరత్ కుమార్ తన అభిమానులకు శుభవార్త చెప్పింది. 14 ఏళ్లుగా ప్రేమించిన వ్యక్తిని త్వరలోనే వివాహం చేసుకోబోతోంది.

Varalakshmi Sarathkumar Engaged: వరలక్ష్మి శరత్ కుమార్ తన అభిమానులకు శుభవార్త చెప్పింది. 14 ఏళ్లుగా ప్రేమించిన వ్యక్తిని త్వరలోనే వివాహం చేసుకోబోతోంది.

  • Published Mar 02, 2024 | 7:19 PMUpdated Mar 02, 2024 | 7:51 PM
పెళ్లి కబురు చెప్పిన వరలక్ష్మి.. కాబోయేవాడి బ్యాగ్రౌండ్ ఇదే!

వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ నటికి సౌత్ లో పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. శరత్ కుమార్ కుమార్తెగా కెరీర్ ప్రారంభించింది. అనతికాలంలోనే తన టాలెంట్, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ముఖ్యంగా టాలీవుడ్ లో లేడీ విలన్స్ కొరత ఉన్న విషయం తెలిసిందే. ఆ ఖాళీని వరలక్ష్మి భర్తీ చేస్తోంది. విలన్ అనే కాదు.. యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలతో అలరిస్తోంది. తాజాగా ఈ అమ్మడు ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రేమించిన వ్యక్తిని నిశ్చితార్థం చేసుకుంది. త్వరలోనే వీరి వివాహం కూడా జరగబోతోంది. మరి.. ఆ పెళ్లికొడుకు బ్యాగ్రౌండ్ ఏంటో చూద్దాం.

వరలక్ష్మి శరత్ కుమార్ కు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. తమిళ్ సినిమాల్లో నటించడం ప్రారంభించి సౌత్ మొత్తాన్ని చుట్టేసింది. ఇప్పుడు తమిళ, తెలుగు, కన్నడ ఇండస్ట్రీల్లో మంచి మంచి ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఒక మంచి బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. సపోర్టింగ్ రోల్, విలన్ పాత్ర అంటూ తేడా లేకుండా యాక్టింగ్ కి స్కోప్ ఉండే ప్రతి పాత్రను చేసుకుంటూ దూసుకుపోతోంది. సినిమాలు మాత్రమే కాకుండా.. అటు వెబ్ సిరీస్ లలో కూడా మెప్పిస్తోంది. తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ తన ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న విషయాన్ని వెల్లడించింది.

పెళ్లికొడుకు మరెవరో కాదు.. ఆమె ఎంతగానో ప్రేమించిన ప్రియుడినే వివాహం చేసుకోబోతోంది. అతను మరెవరో కాదు.. ముంబయికి చెందిన వ్యాపారవేత్త నిక్లాయ్ సచ్ దేవ్. వీళ్లిద్దరు గత 14 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నారంట. ఇప్పుడు పెద్దలకు తమ ప్రేమ వ్యవహారాన్ని చెప్పి.. వారిని ఒప్పించి పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ వేడుక కేవలం కుటుంబసభ్యులు, అతి సన్నిహితుల మధ్యే జరిగింది. మార్చి 1నే వీళ్లి నిశ్చితార్థం జరగ్గా ఈరోజు వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరలక్ష్మి శరత్ కుమార్- నిక్లాయ్ సచ్ దేవ్ నిశ్చితార్థం ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ ఎంగేజ్మెంట్ వార్త బయటకు రాగానే.. వరలక్ష్మిని వివాహం చేసుకోబోతున్న వ్యక్తి బ్యాగ్రౌండ్ గురించి వెతుకులాట మొదలు పెట్టేశారు. అయితే ఆమెను వివాహం చేసుకోబోతున్న నిక్లాయ్ సచ్ దేవ్ ముంబయికి చెందిన వ్యక్తి. ఇతను ఒక వ్యాపారవేత్త అని చెబుతున్నారు. అంతేకాకుండా ముంబయిలో ఒక ఆర్ట్ గ్యాలరీని కూడా రన్ చేస్తున్నాడట. నిశ్చితార్థంతో ఒక్కటైన ఈ జంట అతి త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతామని వెల్లడించారు. ప్రస్తుతం నెట్టింట నిక్లాయ్ సచ్ దేవ్ గురించి.. వరలక్ష్మి- నిక్లాయ్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. మరి.. కామెంట్స్ రూపంలో వరలక్ష్మి- నిక్లాయ్ సచ్ దేవ్ కు మీ శుభాకాంక్షలను తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by IDream Media (@idreammedia)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio