iDreamPost
android-app
ios-app

మా నాన్న వలనే నా జీవితం నాశనం అయింది: వనిత విజయ్ కుమార్

  • Published Feb 24, 2024 | 1:32 PM Updated Updated Feb 24, 2024 | 1:32 PM

Vanitha Vijay Kumar: తమిళ నటి వనిత విజయ్ కుమార్ తన వ్యక్తిగత జీవితం గురించి గతంలో చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Vanitha Vijay Kumar: తమిళ నటి వనిత విజయ్ కుమార్ తన వ్యక్తిగత జీవితం గురించి గతంలో చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 24, 2024 | 1:32 PMUpdated Feb 24, 2024 | 1:32 PM
మా నాన్న వలనే నా జీవితం నాశనం అయింది: వనిత విజయ్ కుమార్

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్లు అందరూ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇక కొన్ని కారణాల వలన సినిమాలకు దూరం అయిన వారంతా.. అడపా దడపా ఏదైనా ఇంటర్వూస్ లో తిరిగి అందరిని పలకరిస్తూ ఉంటారు. ఇక ఆ సమయంలో వారు.. వారి వారి వ్యక్తిగత జీవితం గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు .. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే తమిళ నటి వనిత విజయ్ కుమార్ .. గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో దేవి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది వనితా విజయకుమార్. ఈమె వారి తల్లి తండ్రుల వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఓ ఇంటర్వ్యూలో వనిత విజయ్ కుమార్ .. తన తండ్రి గురించి చేసిన వ్యాఖ్యలు .. సామజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి.

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ అయినా .. విజయ్ కుమార్ , మంజుల జంట గురించి అందరికి తెలుసు. వీరి పెద్ద కుమార్తె వనిత విజయ్ కుమార్. ఈమె మొదట తమిళంలో .. “చంద్రలేఖ” సినిమా తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2000లో నటుడు ఆకాష్ ను పెళ్లి చేసుకుంది. కానీ, కొన్ని కారణాల వలన ఆకాష్ కు విడాకులు ఇచ్చి.. అదే సంవత్సరంలో ఆనంద్ అనే మరో వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది వనిత విజయ్ కుమార్. ఇక ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. ఇక ఆ తర్వాత ఆ వ్యాపారవేత్తకు కూడా విడాకులు ఇచ్చి మరో వ్యక్తిని వివాహం చేసుకుని.. పట్టుమని మూడు నెలలు కూడా గడవకముందే అతనికి కూడా విడాకులు ఇచ్చేసింది. ఇలా ఇండస్ట్రీలో తన చేసిన సినిమాల వలన కంటే.. కాంట్రవర్సిస్ తోనే ఎక్కువ పాపులర్ అయింది వనిత విజయ్ కుమార్. దీని కారణంగా వనిత కుటుంబ సభ్యులు ఈమెను దూరం పెట్టేశారట. ఇక దీనితో వనిత ఆమె కూతుళ్లతో కలిసి ఒంటరిగా ఉంటోందట.

అయితే, ఈ క్రమంలో ఒకనోక ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది వనిత. ఆమె తన తండ్రి గురించి మాట్లాడుతూ.. “మా నాన్న గారు ఓ ఇంటర్వ్యూలో నా కూతుళ్లు పేర్లు అంటూ చెప్పుకొచ్చారు. అందులో కవిత, అనిత, అరుణ్ విజయ్, తర్వాత నా పేరు చెప్పకుండా ప్రీత, శ్రీ దేవి.. పేర్లు చెప్పారు. పెద్ద కూతురిగా నా పేరు కూడా పలకలేదు. నా మాట వినే పిల్లలుగా నాన్న నాకంటే వేరే పిల్లల పేర్లు చెప్పారు. అతను నా పేరు చెప్పకపోవచ్చు. కానీ ప్రపంచానికి తెలుసు నేను ఆయన కూతురునని. ఆయన చెప్పుకోడానికి ఇష్టపడకపోవచ్చు.. కాని ప్రపంచం అలా అనదు.. నేను ఎప్పుడూ అతని బిడ్డనే. పెళ్ళైన కొత్తలో నా పేరు ఎలా పెట్టాలి అని అడిగితే వనితా విజయకుమార్ అని చెప్పాను. అందుకే నాకు ఇప్పటికీ ఆ పేరు ఉంది.” అంటూ చెప్పుకొచ్చారు వనిత విజయ్ కుమార్.

అలాగే , తన తండ్రి కారణంగానే తన జీవితం నాశనం అయిపోయిందంటూ వాపోతూ.. “నేను నా పేరు చివరన భర్త పేరు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు.. నాన్న పేరే పెట్టుకున్నాను. నాన్న మాట వినే ఏకైక బిడ్డను నేను. కాని అతని వల్లే నా జీవితం దిగజారింది. వదిలేస్తే నా జీవితం ఎలాగైనా ఉండేది. కానీ అతని మాటలు వినడం వల్ల నా జీవితం చాలా మారిపోయింది. దానికి కారణం నా తండ్రే.” అంటూ వనిత తన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు ట్రోల్ అవ్వడానికి కారణం .. ఇటీవల విజయకుమార్ తన మనవరాలు దియా పెళ్లి జరిగింది. కానీ, ఆ వేడుకకు వనితను మాత్రం ఎవరు ఆహ్వానించలేదట. దీనితో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet