iDreamPost
android-app
ios-app

ఓసారి మిస్ అయ్యిందని.. ఆ డైరెక్టర్ ఈసారి పట్టుబట్టాడా..?

  • Author ajaykrishna Updated - 05:43 PM, Mon - 28 August 23
  • Author ajaykrishna Updated - 05:43 PM, Mon - 28 August 23
ఓసారి మిస్ అయ్యిందని.. ఆ డైరెక్టర్ ఈసారి పట్టుబట్టాడా..?

డెబ్యూ మూవీతో సూపర్ సక్సెస్ అందుకొని.. కొద్దిరోజులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది వైష్ణవి చైతన్య. హీరోయిన్ అయ్యేందుకు ఎంతో హార్డ్ వర్క్ తో ప్యాషన్ తో సినిమాలవైపు అడుగులు వేసిన వైష్ణవి.. మొదటగా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో ఫేమ్ సంపాదించుకుంది. కట్ చేస్తే.. కొన్నాళ్ళ కష్టానికి బేబీ మూవీ రూపంలో ఫలితం దక్కింది. ఎంతో కొంత అని సరిపెట్టుకునేంత కాదు.. బేబీ మూవీ కావాల్సినంత అందించిందని చెప్పాలి. ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీ దృష్టిలో పడటం అనేది రేర్ గా జరుగుతుంటుంది. ఎందుకంటే.. కొత్త అమ్మాయిలతో వచ్చే ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించడం అరుదుగానే జరుగుతుంటాయి.

ఇక బేబీ మూవీతో సక్సెస్ అయిన వైష్ణవి.. తదుపరి సినిమా ఎవరితో చేయబోతుంది? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఓవైపు పెద్ద నిర్మాణ సంస్థలో చేయనుందని వార్తలొస్తున్నాయి.. మరోవైపు ఇంకా ఏ ప్రాజెక్ట్ ఆమె వద్దకు రాలేదు అని టాక్ ఉంది. కానీ.. ఈ రెండింటికి భిన్నంగా మరో వార్త ఇండస్ట్రీ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. అది ఎంతవరకు నిజమో తెలియదు గానీ.. అది విన్న వైష్ణవి ఫ్యాన్స్ కి మాత్రం హాట్ కేక్ లాగే అనిపిస్తుంది. అదేంటంటే.. డెబ్యూ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఓ డైరెక్టర్.. వైష్ణవిని తన రెండో మూవీలో హీరోయిన్ గా పెట్టుకునే ఆలోచన చేస్తున్నాడట. ఆ డైరెక్టర్ ఎవరో అర్థమైందా..?

ఆ వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమా ‘బలగం’. కమెడియన్ వేణు కాస్త.. ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే తనలో మంచి దర్శకుడు దాగి ఉన్నాడని ప్రూవ్ చేశాడు. మొదటి సక్సెస్ కే ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సెకండ్ మూవీని లైన్ చేస్తున్నాడు. అయితే.. ఆ మధ్య బలగం సినిమా కోసం ముందుగా వైష్ణవిని తీసుకోవాలని ట్రై చేశాను. కానీ.. ఆమె బేబీకి కమిట్ అవ్వడంతో.. కావ్యను తీసుకున్నట్లు చెప్పాడు వేణు. అప్పుడు ఫస్ట్ మూవీ మిస్ అయితే అయ్యింది గానీ.. ఈసారి సెకండ్ మూవీకి పక్కాగా వైష్ణవినే తీసుకోవాలని గట్టిగా ట్రై చేస్తున్నాడట వేణు. ఈ వార్త ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది. ఇక వేణు సెకండ్ మూవీ ఏ హీరోతో ప్లాన్ చేశాడోగాని.. వైష్ణవిని తీసుకుంటాడో లేదో చూడాలి. మరి వైష్ణవి, వేణుల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss