iDreamPost
android-app
ios-app

బేబీ సక్సెస్ తర్వాత ఫస్ట్ వీడియో పోస్ట్ చేసిన వైష్ణవి! ఏమందంటే..

  • Author ajaykrishna Published - 08:10 AM, Thu - 10 August 23
  • Author ajaykrishna Published - 08:10 AM, Thu - 10 August 23
బేబీ సక్సెస్ తర్వాత ఫస్ట్ వీడియో పోస్ట్ చేసిన వైష్ణవి! ఏమందంటే..

ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఫస్ట్ మూవీ సక్సెస్ కావడం అనేది ఎవరికైనా బిగ్ డ్రీమ్. కెరీర్ స్టార్టింగ్ లో సక్సెస్ అనేది.. మంచి బూస్ట్ ఇస్తుంది. ఫ్యూచర్ గురించి కాంఫిడెన్స్ కూడా వస్తుంది. ప్రస్తుతం అలాంటి మూమెంట్స్ ని ఆస్వాదిస్తుంది తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా సినిమాల్లోకి వచ్చిన వైష్ణవి.. ఇటీవల బేబీ సినిమాతో హీరోయిన్ గా డెబ్యూ చేసింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బిగ్ సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో వైష్ణవి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పాలి. ఫస్ట్ మూవీలోనే చాలా డేర్ స్టెప్ వేసిందని ప్రశంసలు కూడా అందుకుంది.

ఇక బేబీ మూవీని హృదయ కాలేయం, కొబ్బరిమట్ట ఫేమ్ సాయి రాజేష్ తెరకెక్కించారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ.. దాదాపు రూ. 80 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను అల్లు అర్జున్, మెగాస్టార్, అల్లు అరవింద్ లాంటి సినీ ప్రముఖులు సక్సెస్ మీట్స్ పెట్టి మరీ మూవీ టీమ్ ని అభినందించారు. ముఖ్యంగా వైష్ణవికి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే.. ప్రస్తుతం బేబీ టీమ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో తన మొదటి సినిమానే బిగ్ హిట్ అయ్యేసరికి.. తన కెరీర్ లో సక్సెస్ కి కారణమైన వారికి వీడియో రూపంలో కృతజ్ఞతలు తెలిపింది వైష్ణవి.

వైష్ణవి మాట్లాడుతూ.. “నా లైఫ్ లో ఇంపార్టెంట్ అనుకున్నవి చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి ఇన్‌ఫినిటం. నటిగా నా జర్నీ అక్కడే మొదలైంది. నన్ను ఎప్పుడూ.. ఏదొక రోజు పెద్ద స్టార్ అవుతానని ఎంకరేజ్ చేస్తుండేవారు. నాకు అంత టాలెంట్ ఉందని ముందుగా గుర్తించింది వాళ్లే. నాకు సపోర్ట్ చేసినందుకు ఇన్ఫినిటంకి చాలా థ్యాంక్స్. నా లైఫ్ లో నేను ఎక్కడినుండి వచ్చానో ఆ మూలాలను ఎప్పటికి మర్చిపోను. అలాగే నేను గుర్తు పెట్టుకోవాల్సిన వారు చాలామంది ఉన్నారు. ఇక నా ఫస్ట్ సినిమాని ఇంతగా ఆదరించి పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్.” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వైష్ణవి పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి వైష్ణవి గురించి, బేబీ సినిమా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet