iDreamPost
android-app
ios-app

తండ్రేమో స్టార్ కమెడియన్.. కొడుకు మాత్రం వ్యవసాయం చేస్తూ..

  • Published Jan 24, 2024 | 1:02 PM Updated Updated Jan 24, 2024 | 1:02 PM

తల్లిదండ్రుల పేరు చెప్పుకొని అవకాశాలు దక్కించుకునే ఈరోజుల్లో ఓ స్టార్ కమెడియన్ కొడుకు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తండ్రికి పేరు ప్రఖ్యాతలున్నప్పటికీ తన పేరును ఎక్కడా ఉపయోగించడం ఇష్టం లేక వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు.

తల్లిదండ్రుల పేరు చెప్పుకొని అవకాశాలు దక్కించుకునే ఈరోజుల్లో ఓ స్టార్ కమెడియన్ కొడుకు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తండ్రికి పేరు ప్రఖ్యాతలున్నప్పటికీ తన పేరును ఎక్కడా ఉపయోగించడం ఇష్టం లేక వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు.

  • Published Jan 24, 2024 | 1:02 PMUpdated Jan 24, 2024 | 1:02 PM
తండ్రేమో స్టార్ కమెడియన్.. కొడుకు మాత్రం వ్యవసాయం చేస్తూ..

సాధారణంగా ఏ ఇండస్ట్రీలోనైనా యాక్టర్ల పిల్లలు సినీ రంగంలోకి ప్రవేశించడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. హీరోల నుంచి మొదలుకొని కమెడియన్ల పిల్లల వరకు సిల్వర్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నటనారంగంలోకి అడుగుపెడతారు. ఇప్పటికే పలువురు హీరోలు, డైరెక్టర్లు, కమెడియన్ల్ పిల్లలు సినిమా రంగంలో రాణిస్తున్నారు. మరికొంతమందేమో బిజినెస్ అంటూ ఎవరి వ్యాపకాల్లో వారు కొనసాగుతున్నారు. కాగా కోలీవుడ్ కు చెందిన స్టార్ కమెడియన్ కొడుకు మాత్రం వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. ఇటీవల ఆ స్టార్ కమెడియన్ కొడుకు యూట్యూబ్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

కోలీవుడ్ కు చెదిన ఫేమస్ కమెడియన్ వడివేలు దాదాపు అందరికీ సుపరిచమే. సినిమాల్లో తన హాస్యంతో నవ్వులు పుట్టిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు కమెడియన్ వడివేలు. ఓ వివాదం కారణంగా చాలా కాలం నుంచి సినిమాలకు దూరమైన వడివేలు మళ్లీ ఈ మధ్యనే సినిమాల్లోకి తిరిగి వచ్చారు. వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. ఈ మధ్యే ‘మామన్నన్’ లో తన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. కాగా వడివేలు కుటుంబానికి సంబంధించిన విషయాలు కూడా ఎక్కడా వెల్లడించిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో లెజెండరీ కమెడియన్ వడివేలు కొడుకుకు సంబంధించిన ఇంట్రస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హాస్య నటుడు వడివేలుకు కూతురు, కొడుకు ఉన్నారు. కాగా కొడుకు పేరు సుబ్రమణి. స్టార్ కమెడియన్ కొడుకైన అతను పల్లెటూర్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటీవల సుబ్రమణి ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తండ్రి వడివేలు గురించి.. తమ కుటుంబం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తన తండ్రి పేరును ఎక్కడా ఉపయోగించుకోనని అలా చేయడం ఆయనకు ఇష్టం ఉండదని సుబ్రమణి తెలిపారు. తండ్రికి వారసత్వంగా వచ్చిన భూమిలోనే వ్యవసాయం చేసుకుంటున్నానని వడివేలు కొడుకు సుబ్రమణి వెల్లడించారు. ఇక స్టార్ కమెడియన్ కొడుకై ఉండి ఇలా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న సుబ్రమణిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş