iDreamPost
android-app
ios-app

నిమిషానికి రూ. కోటి పారితోషికమా.. ఊర్వశి అంత తీసుకుంటుందా?

  • Author ajaykrishna Updated - 12:35 PM, Thu - 31 August 23
  • Author ajaykrishna Updated - 12:35 PM, Thu - 31 August 23
నిమిషానికి రూ. కోటి పారితోషికమా.. ఊర్వశి అంత తీసుకుంటుందా?

ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్ల రెమ్యూనరేషన్స్ అనేవి ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. అప్పుడప్పుడు హీరోల గురించి అయినా.. మాట్లాడుకోకుండా ఉంటారేమో గానీ.. హీరోయిన్స్ విషయంలో ఏ చిన్న విషయమైనా ఫ్యాన్స్, నెటిజన్స్ ఎప్పటికప్పుడు డిస్కషన్స్ పెడుతుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి గురించి అలాగే చర్చించుకుంటున్నారు ప్రేక్షకులు. ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీగా దూసుకుపోతున్న ఈ భామ.. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే.. మరోవైపు వేరే సినిమాలలో ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తోంది. అయితే.. కొద్దిరోజులుగా ఊర్వశి.. నిమిషానికి కోటి రూపాయలు పారితోషికం తీసుకుంటుందని టాక్ నడుస్తుంది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. ఊర్వశి రౌతేలా గురించి నార్త్ తో సౌత్ లో కూడా పరిచయం అవసరం లేదు. ఏ భాషలో అవకాశం దొరికితే ఆ భాషలో తన పేరు వినిపించేలా ప్రయత్నాలు చేస్తోంది అమ్మడు. తెలుగులో వాల్తేరు వీరయ్య.. సినిమాలోని ‘బాస్ పార్టీ’ సాంగ్ తో ప్రేక్షకులకు దగ్గరైంది. అదే ఊపులో ఏజెంట్, బ్రో సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసింది. అంటే.. ఒకే ఏడాది తెలుగులోనే మూడు స్పెషల్ సాంగ్స్ చేసేసింది. ఇక రామ్ హీరోగా తెరకెక్కిన స్కంద సినిమాలో కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే.. ఊర్వశి ప్రస్తుతం ఓ హిందీ సినిమాతో.. ఓ బ్లాక్ రోజ్ అనే తెలుగు సినిమాలో సైతం నటిస్తోంది. ఆ సినిమాతోనే హీరోయిన్ గా తెలుగులో డెబ్యూ చేయబోతుంది ఊర్వశి.

ఇదిలా ఉండగా.. కొద్దిరోజులుగా ఊర్వశి రెమ్యూనరేషన్ గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒక నిమిషానికి ఏకంగా రూ. కోటి తీసుకుంటుందని టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి రీసెంట్ గా ఓ ఈవెంట్ లో.. నిమిషానికి కోటి పారితోషికం తీసుకుంటున్నారని విన్నాం? దాని గురించి మీరు ఏమంటారు? అని ఓ మీడియా వ్యక్తి ప్రశ్నించడం జరిగింది. దానికి స్పందించిన ఊర్వశి.. “అలా తీసుకుంటే మంచి విషయమేగా.. ఇండస్ట్రీలో స్వతహాగా పైకి వచ్చింల్ని దాన్ని. నాలాంటి ప్రతీ ఒక్కరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అందుకు తగ్గట్టు రెమ్యూనరేషన్ కూడా అందితే హ్యాపీనే” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఊర్వశి మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఊర్వశి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom