iDreamPost
android-app
ios-app

షన్ను సోదరుడి కేసులో కీలక విషయాలు.. చాలామందిని మోసం చేశాడా?

  • Published Feb 24, 2024 | 7:48 PM Updated Updated Feb 24, 2024 | 7:48 PM

Shanmukh Brother Sampath Case: ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ సోదరుడి కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతనిపై మరిన్న ఆరోపణలు వైరల్ అతున్నాయి.

Shanmukh Brother Sampath Case: ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ సోదరుడి కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతనిపై మరిన్న ఆరోపణలు వైరల్ అతున్నాయి.

  • Published Feb 24, 2024 | 7:48 PMUpdated Feb 24, 2024 | 7:48 PM
షన్ను సోదరుడి కేసులో కీలక విషయాలు.. చాలామందిని మోసం చేశాడా?

ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ ఇటీవల గంజాయి కేసులో అరెస్టు అయ్యి.. బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అతని సోదరుడు సంపత్ పై పోలీసులకు ఓ అమ్మాయి ఫిర్యాదు చేసింది. పోలీసులు షన్ను సోదరుడు సంపత్ కోసం ఇంటికి వెళ్లారు. అక్కడ ఊహించని రీతిలో గంజాయితో షన్ను దొరికిపోయాడు. ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇవి మాత్రమే కాకుండా.. ఈ కేసుల్లో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షన్ను సోదరుడి వల్ల ఎంతో మంది మోసపోయారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

షణ్ముఖ్ జశ్వంత్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. అలాగే బిగ్ బాస్ తో ఆ ఫేమ్ మరింత పెరిగింది. అతనికి సంపత్ అనే సోదరుడు ఉన్నాడని అందిరకీ తెలుసు. అయితే అతను పెళ్లి పేరుతో మోసం చేశాడు అంటూ ఓ యువతి నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపత్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదల కూడా చేశారు. అయితే ఈ కేసు తర్వాత సంపత్ ద్వారా బాధించబడిన, మోసపోయిన వాళ్లు చాలా మంది బయటకు వస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. సంపత్ వల్ల మోసపోయింది వీళ్లే అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఆ కథనాల ప్రకారం.. సంపత్ తన ఎంబీఏ క్లాస్ మేట్ దగ్గర థిక్ షేక్ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెడదామని చెప్పి రూ.20 లక్షలు తీసుకున్నాడట. ఆ తర్వాత నెలకు కేవలం రూ.7 వేలు మాత్రమే లాభాలుగా చూపించాడట. ఈ లాభాలు చూసిన తర్వాత ఆ యువతి మొత్తం పెట్టుబడి తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేసిందంట. కానీ, సంపత్ మాత్రం డబ్బు ఇవ్వకపోగా ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు అంటూ చెబుతున్నారు. ఓ యువతితో నిశ్చితార్థం చేసుకుని.. ఆరు రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది అనగా.. మరో లేడీ డాక్టర్ తో సంపత్ వివాహానికి రెడీ అయ్యాడట. ముంబయిలో మరో యువతికి ఇప్పటికే సంపత్ వివాహం చేసుకున్నాడు అంటూ చెబుతున్నారు. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. సంపత్ బారిన పడి మోసపోయినవాళ్లు చాలామందే ఉన్నారు.. ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు అంటూ ప్రముఖ మీడియా సంస్థ సాక్షి తమ కథనంలో తెలిపింది. మరి.. సంపత్ వల్ల ఎంతో అమ్మాయిలు మోసపోయారు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet