iDreamPost
android-app
ios-app

2023 లాస్ట్ 4 నెలలు.. థియేటర్స్ లో సందడి చేయనున్న బిగ్గెస్ట్ మూవీస్ ఇవే!

  • Author ajaykrishna Updated - 01:17 PM, Mon - 28 August 23
  • Author ajaykrishna Updated - 01:17 PM, Mon - 28 August 23
2023 లాస్ట్ 4 నెలలు.. థియేటర్స్ లో సందడి చేయనున్న బిగ్గెస్ట్ మూవీస్ ఇవే!

2023లో ఫ్యాన్స్ పండగ చేసుకునే రేంజ్ సినిమాలు తక్కువగా వచ్చాయి. ముఖ్యంగా థియేటర్స్ గతేడాదిలా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, కాంతార, కార్తికేయ 2, బింబిసార, సీతారామం.. లాంటి ఆడియన్స్ ఫుట్ ఫాల్స్ పెంచిన సాలిడ్ సినిమాలు రాలేదు. అయితే.. ఏడాది ఆల్రెడీ సగానికి పైగా ముగిసింది. అంటే ఈ ఏడాది సినిమాలు ఆడలేదని కాదు. బాలీవుడ్ నుండి పఠాన్ తప్ప ఏ సినిమా రూ. 1000 కోట్ల మార్క్ అందుకోలేదు. రీసెంట్ గా జైలర్ రూ. 600 కోట్లు.. అంతకుముందు ఆదిపురుష్ రూ. 450 కోట్లు రీచ్ అయ్యాయి. కానీ.. వెయ్యి కొట్టే దమ్మున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఏదొక లోపంతో బెడిసి కొడుతున్నాయి.

ఇప్పటికి 2023లో 8 నెలలు పూర్తవుతున్నాయి. ఇంకా నాలుగు నెలలు మాత్రమే ఏడాది ఎండింగ్ కి టైమ్ ఉంది. సో.. ఇప్పుడు మిగతా నాలుగు నెలలను షేక్ చేసేందుకు బిగ్గెస్ట్ మూవీస్ తో పాటు మీడియం, స్మాల్ సినిమాలు సైతం రిలీజ్ డేట్స్ ఖరారు చేసుకొని రెడీ అవుతున్నాయి. సెప్టెంబర్ 1 నుండి డిసెంబర్ చివరివరకు ఏమేం సినిమాలు బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతున్నాయో ఓ లిస్ట్ సిద్ధం అయ్యింది. దాని ప్రకారం.. ఈసారి జవాన్, సలార్, లియో లాంటి సినిమాలకు పోటీగా మీడియం, చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. మరి ఇప్పటికైతే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన.. క్రేజీ బిగ్గెస్ట్ మూవీస్ లిస్ట్ చూద్దాం. దాదాపు నెక్స్ట్ నాలుగు నెలలు ఈ లిస్ట్ లో ఉన్న సినిమాలే థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి.

నెక్స్ట్ 4 నెలల్లో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్:

సెప్టెంబర్:

  • ఖుషి – 1
  • మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి – 7
  • జవాన్ – 7
  • ది నన్ 2 – 7
  • స్కంద – 15
  • చంద్రముఖి 2 – 15
  • మార్క్ ఆంటోనీ – 15
  • ఎక్సపెండబుల్స్ – 22
  • సలార్ – 28
  • ది వాక్సిన్ వార్ – 28

అక్టోబర్:

  • టిల్లు స్క్వేర్ – 6
  • భగవంత్ కేసరి – 19
  • లియో – 19
  • ఘోస్ట్ – 19
  • టైగర్ నాగేశ్వరరావు – 20

నవంబర్:

  • శశివదనే – 5
  • ఆదికేశవ – 10
  • టైగర్ 3- 10
  • ది మార్వేల్స్ – 10
  • జపాన్ – 10 (ఇంకా కన్ఫర్మ్ కాలేదు)
  • అయలాన్ – 10 (కన్ఫర్మ్ కాలేదు)
  • జిగర్తండా 2 – 10 (కన్ఫర్మ్ కాలేదు)
  • డెవిల్ – 24

డిసెంబర్:

  • యానిమల్ – 1
  • ఆపరేషన్ వాలంటైన్ – 8
  • గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి – 8
  • కెప్టెన్ మిల్లర్ – 15
  • హాయ్ నాన్న – 21
  • సైందవ్ – 22
  • హరోంహర – 22
  • డుంకి – 22(కన్ఫర్మ్ కాలేదు)
  • నితిన్ ఎక్సట్రా – 23
  • ఆక్వామాన్ – 25

ప్రస్తుతానికి ఇవ్వతే రిలీజ్ డేట్స్ ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలలో మీరు ఏయే సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom