iDreamPost
android-app
ios-app

తమన్నాకు కోట్ల ఖరీదైన వజ్రాన్ని బహుమతిగా ఇచ్చిన ఉపాసన.. వైరలవుతోన్న ఫొటో!

  • Published Jul 24, 2023 | 11:32 AM Updated Updated Jul 24, 2023 | 11:32 AM
  • Published Jul 24, 2023 | 11:32 AMUpdated Jul 24, 2023 | 11:32 AM
తమన్నాకు కోట్ల ఖరీదైన వజ్రాన్ని బహుమతిగా ఇచ్చిన ఉపాసన.. వైరలవుతోన్న ఫొటో!

ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా మారుమోగుతున్న పేరు ఏదైనా ఉంది అంటే.. అది మిల్కీ బ్యూటీ తమన్నా పేరు మాత్రమే. ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో తమన్నా అంటే పద్దతికి మారు పేరు అన్నట్లు ఉండేది. ఎక్కడా అసభ్యత, అశ్లీలతకు అవకాశం ఇవ్వలేదు. కనీసం ముద్దు సీన్లకు కూడా అంగీకరించలేదు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎంతో పద్దతిగా ఉండి.. ఎక్స్‌పోజింగ్‌కు పర్మిషన్‌ ఇవ్వని తమన్నా.. జీ కర్దా, లస్ట్‌ స్టోరీస్‌-2లో ఆ హద్దులు చెరిపేసింది. ముద్దు సీన్లు, బోల్డ్‌ సీన్స్‌లో రెచ్చిపోయింది. వయసు పైబడింది.. అవకాశాలు రావడం లేదు కదా.. అందుకే ఇంతలా దిగి జారింది అనే విమర్శలు వచ్చాయి. కానీ మిల్కీ బ్యూటీ మాత్రం అవేం పట్టించుకోవడం లేదు. ఇక ఇదే సమయంలో బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో ప్రేమాయణం గురించి కూడా బహిరంగ ప్రకటన చేసింది తమన్నా.

ప్రస్తుతం రజనీకాంత్‌ సరసన జైలర్‌ చిత్రంలో నటిస్తోంది తమన్నా. ఈ చిత్రం నుంచి ఈ మధ్యే విడుదలైన కావాలయ్య సాంగ్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటలో మాస్‌ స్టెప్పులేసి.. డ్యాన్స్‌ ఇరగదీసింది తమన్నా. ఇదిలా ఉండగా తాజాగా తమన్నాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అంది ఏంటంటే.. మెగా కోడలు ఉపాసన.. తమన్నాకు కోట్ల రూపాయల విలువైన వజ్రాన్ని బహుమతిగా ఇచ్చారంట. ఎందుకు అంటే..

తమన్నాకు మెగా కోడలు ఉపాసన ఖరీదైన బహుమతి ఇచ్చింది. ప్రపంచంలోనే ఐదవ పెద్దదయిన వజ్రాన్ని మిల్కీ బ్యూటీకి గిఫ్ట్‌ ఇచ్చింది ఉపాసన. ఈ డైమండ్‌ ఖరీదు ఏకంగా రెండు కోట్ల రూపాయలు. వామ్మో.. అంత ఖరీదైన బహుమతా.. ఇంతకు ఎప్పుడు ఇచ్చింది.. ఎందుకు ఇచ్చింది అంటే.. నాలుగేళ్ల క్రితం ఈ సంఘటన జరిగింది. తమన్నా మెగాస్టార్‌ చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా చాలా కీలక పాత్రలో నటించింది. ఆమె నటకు ఫిదా అయినా ఉపాసన తమన్నాకు ఇంత ఖరీదైన వజ్రాన్ని బహుకరించింది. మెగా కోడలు ఇచ్చిన గిఫ్ట్‌ను తన వేలికి ధరించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో కూడా షేర్‌ చేయడంతో అవి తెగ వైరలయ్యాయి. అప్పట్లో ఈ వార్త టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది.

ఇక ఉపాసన గిఫ్ట్‌గా ఇచ్చిన ఈ వజ్రం ప్రపంచంలోనే ఐదవ పెద్ద డైమండ్‌. దీని బరువు, సైజ్‌ ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఈ వ్రజం మెరుపు, రూపం చూడగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే ఉపాసన నాలుగేళ్ల క్రితం తమన్నాకు ఈ బహుమతి ఇచ్చింది. దీని గురించి వీరిద్దరి మధ్య ట్విట్టర్‌లో చిట్‌చాట్‌ కూడా జరిగింది. అయితే నాలుగేళ్ల తర్వాత మరోసారి ఈ డైమండ్‌ గిఫ్ట్‌ టాపిక్‌ తెర మీదకు రావడంతో మరోసారి ఈ ఫొటో వైరల్‌ అవుతోంది.