iDreamPost
android-app
ios-app

నివేదాకి ఉదయనిధి రూ. 50 కోట్లు ఇల్లు కొనిపెట్టాడు: తమిళ జర్నలిస్ట్!

  • Published Mar 05, 2024 | 6:42 PM Updated Updated Mar 05, 2024 | 7:08 PM

కోలీవుడ్ నాట యూట్యూబర్ శంకర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేగుతున్నాయి. ఎప్పుడూ రాజకీయ నేతలను విమర్శలు చేసే ఆయన.. తాజాగా ఓ నటి పేరు ప్రస్తావించాడు. దీంతో..

కోలీవుడ్ నాట యూట్యూబర్ శంకర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేగుతున్నాయి. ఎప్పుడూ రాజకీయ నేతలను విమర్శలు చేసే ఆయన.. తాజాగా ఓ నటి పేరు ప్రస్తావించాడు. దీంతో..

  • Published Mar 05, 2024 | 6:42 PMUpdated Mar 05, 2024 | 7:08 PM
నివేదాకి ఉదయనిధి రూ. 50 కోట్లు ఇల్లు కొనిపెట్టాడు: తమిళ జర్నలిస్ట్!

నటీనటుల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ.. వార్తల్లో నిలుస్తుంటారు కొందరు. బాలీవుడ్ సినిమా క్రిటిక్ కెఆర్కే మూవీలపైనే కాకుండా.. సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై కూడా కామెంట్స్ చేస్తూ వివాదాలు కొని తెచ్చుకుంటాడు. తాజాగా కోలీవుడ్‌లో సావుక్కు శంకర్ అనే సోషల్ మీడియా ఇన్ప్లుయోన్సర్, యూట్యూబర్, జర్నలిస్ట్.. సినీ, రాజకీయ సెలబ్రిటీలపై నోరు పారేసుకున్నారు. తరచూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రాజకీయ ప్రముఖులను విమర్శ చేసే శంకర్.. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ నివేదా పేతురాజ్.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, నటుడు కమ్ డీఎంకే ఎమ్మెల్యే ఉదయ్ నిథి స్టాలిన్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఇవి తమిళనాట పెను దుమారం రేగుతున్నాయి. దీనిపై నటి నివేదా పేతురాజ్ గట్టిగా కౌంటరిచ్చింది. ఇంతకు అతడు ఏమన్నాడంటే…

తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో శంకర్ మాట్లాడుతూ.. ఉదయ నిధి స్టాలిన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో నటి నివేదా పేరును ప్రస్తావించాడు. ‘ఉదయనిధికి ఓ లేడీ ఫ్యాన్ ఉంది, ఆమె కోసం దుబాయ్‌లో రూ. 50 కోట్ల విలువ చేసే ఇల్లు కొన్నాడు. ఆమె ఎవరంటే నివేదా పేతురాజ్. ఇండియాలో కాకుండా దుబాయ్ లో ఎందుకు కొన్నాడంటే.. అతడికి కాస్త పొసెసివ్ ఎక్కువ. ఇక్కడ ఆమెను ఉంచకూడదన్న ఉద్దేశంతో దుబాయ్‌లో ఇల్లు కొని అక్కడే ఉంచాడు. నెలకు రెండు సార్లు మాత్రమే తమిళనాడుకు వస్తాడు. ఆమె కోసం తమిళనాడులో క్రీడా పోటీలు కూడా పెట్టాడు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తమిళ జర్నలిస్ట్ శంకర్ అన్న వ్యాఖ్యలు.. ఇక్కడ వీడియో రూపంలో చూడండి.

దీనిపై నివేదితా పేతురాజ్ కౌంటరిస్తూ..ట్విట్టర్‌లో సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ‘నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఓ తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను. ఎందుకంటే.. అమ్మాయి జీవితాన్నినాశనం చేసే ముందు కాస్త నిజం తెలుసుకుని మాట్లాడే మానవత్వం కలిగిన మనుషులు ఉండకపోతారా అని భావించాను. కానీ ఈ వార్తలతో నేను, మా కుటుంబం తీవ్ర కుంగుబాటుకు లోనవుతున్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నేను 16 సంవత్సరాల వయస్సు నుండి ఆర్థికంగా స్వతంత్రంగా బతుకుతున్నా. నా కుటుంబం ఇప్పటికీ దుబాయ్‌లో నివసిస్తోంది. 20 ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నాం. సినీ పరిశ్రమలో అవకాశాలు ఇవ్వమని, ఇప్పించమని ఏ నిర్మాతను, దర్శకుడ్ని, హీరోని నేనేప్పుడూ అడగలేదు.

నేను 20కి పైగా సినిమాలు చేశాను. అవన్నీ నాకు నేనుగా సంపాదించుకున్నవి. నా గురించి ఇప్పటివరకు మాట్లాడిన సమాచారం ఏదీ నిజం కాదు. మేము 2002 నుండి దుబాయ్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాము. అలాగే, 2013 నుండి నాకు రేసింగ్ అంటే ఇంట్రెస్ట్ కలిగింది. నిజానికి చెన్నైలో నిర్వహిస్తున్న రేసుల గురించి నాకు తెలియదు. నేను మీ కళ్లకు ఏదో లగ్జరీ లైఫ్ బతుకుతున్నానని అనుకుంటున్నారు. నేను చాలా సాదా సీదా జీవితాన్ని గడుపుతున్నాను. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాత ప్రస్తుతం మానసికంగా, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను. మీ కుటుంబంలోని ఇతర స్త్రీలు పట్ల కూడా మీరు ఇదే కోరుకుంటారు కదా. జర్నలిజంలో కొంత మానవత్వం మిగిలి ఉంది. నా పరువు తీయరన్న నమ్మకంతో నేను ఎటువంటి చట్టబద్దమైన చర్యలు తీసుకోవడం లేదు. నా ప్రతిష్టను దిగజార్చే ముందు సమాచారాన్ని తెలుకోవాలని కోరుతున్నాను. ఇకపై నా కుటుంబాన్ని ఎలాంటి బాధకు గురి చేయవద్దని జర్నలిస్టులను కోరుతున్నా. నాకు మద్దుతుగా నిలిచి వారికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేసింది నివేదా పేతురాజ్. కాగా ఉదయ్, నివేదా గతంలో పొదువగ ఎం మనసు తాంగం మూవీలో నటించారు..

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet