iDreamPost
android-app
ios-app

ఉదయ్ కిరణ్ ‘నువ్వు నేను’ రీ రిలీజ్.. ఎప్పుడంటే?

Nuvvu Nenu Movie Re Release: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి తారా జువ్వాల దూసుకు వచ్చిన ఉదయం కిరణ్.. అంతే వేగంగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. త్వరలో ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ మూవీ రిలీజ్ కాబోతుంది.

Nuvvu Nenu Movie Re Release: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి తారా జువ్వాల దూసుకు వచ్చిన ఉదయం కిరణ్.. అంతే వేగంగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. త్వరలో ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ మూవీ రిలీజ్ కాబోతుంది.

ఉదయ్ కిరణ్ ‘నువ్వు నేను’ రీ రిలీజ్.. ఎప్పుడంటే?

తెలుగు ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చారు. తమ టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పించి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. అలాంటి వారిలో ఉదయ్ కిరణ్ ఒకరు. 2000 సంవత్సరాంలో చిత్రం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ వరుసగా నువ్వు నేను, మనసంతా నువ్వే మూవీస్ తో బాక్సాఫీస్ షేక్ చేశాడు. ఈ మూడు సినిమాల ప్రేమ కథతో వచ్చినవే.. అందుకే అప్పట్లో ఉదయ్ కిరణ్ ని యువతులు లవర్ బాయ్ గా పిలిచేవారు. అంతేకాదు వరుసగా మూడు సినిమాలు హిట్ సాదించినందుకు ‘హ్యాట్రిక్ హీరో’అనే పేరు కూడా వచ్చింది. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన ఉదయ్ కిరణ్ అర్థాంతరంగా తనువు చాలించుకున్నాడు. తాజాగా ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో ప్రేమ కథా చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. హార్ట్ టచింగ్ కంటెంట్ ఉంటే.. ఏ చిత్రాన్నైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న విషయం తెలిసిందే. 2001 లో రిలీజ్ అయిన నువ్వు నేను మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఉదయ్ కిరణ్ రెండో సినిమా నువ్వు నేను. ఆయన నటించిన సూపర్ హిట్ మూవీస్ లో ఇదీ ఒకటి. క్రేజీ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వు నేను’ మూవీ అంచనాలకు మించి విజయం సాధించింది. కలెక్షన్లు కూడా భారీగా రాబట్టింది. ఈ మూవీకి సంగీతం ఆర్ పీ పట్నాయక్ అందించారు. ఈ మూవీలో తనదైన కామెడీతో సునీల్ కడుపుబ్బా నవ్వించాడు. యూత్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ గా నువ్వు నేను మూవీ నిలిచింది. ఈ మూవీ తిరిగి మళ్లీ థియేటర్లో రిలీజ్ చేసేందుకు సిద్దం చేస్తున్నారు.

బాక్సాఫీస్ షేక్ చేసిన ఈ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతుంది. ఇప్పటికే ఈ సినిమా బృందం వారు రీ- రిలీజ్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తుంది. అందులో బాగంగా ఈ మూవీని మార్చి 21 న థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మధ్యకాలంలో రీ- రిలీజ్ సినిమాలకు మంచి క్రేజ్ లభిస్తుంది. అప్పట్లో లవర్ బాయ్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ అభిమానులకు ఇది ఓ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ మూవీ రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అప్పట్లో కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మూవీ ఇప్పుడు ఏ రేంజ్ లో వసూళ్లు చేస్తుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి