iDreamPost
android-app
ios-app

నువ్వు నేను మూవీ రీ రిలీజ్.. ఉదయ్ కిరణ్ సోదరి ఎమోషనల్!

  • Published Mar 11, 2024 | 7:41 PM Updated Updated Mar 11, 2024 | 7:41 PM

Uday Kiran Sister Emotional: టాలీవుడ్ లో ఇప్పుడల్లా రీ రిలీజుల ట్రెండ్ ఆగేలా లేదు. ప్రస్తుం ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను చిత్రం కూడా రీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సోదరి శ్రీదేవి ఎమోషనల్ అయ్యింది.

Uday Kiran Sister Emotional: టాలీవుడ్ లో ఇప్పుడల్లా రీ రిలీజుల ట్రెండ్ ఆగేలా లేదు. ప్రస్తుం ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను చిత్రం కూడా రీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సోదరి శ్రీదేవి ఎమోషనల్ అయ్యింది.

  • Published Mar 11, 2024 | 7:41 PMUpdated Mar 11, 2024 | 7:41 PM
నువ్వు నేను మూవీ రీ రిలీజ్.. ఉదయ్ కిరణ్ సోదరి ఎమోషనల్!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజుల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇవి ఎంతదూరం వెళ్లాయి అంటే.. రీ రిలీజులకు సంబంధించి కూడా బాక్సాఫీస్ కలెక్షన్స్, ఫ్యాన్స్ వార్స్, స్పెషల్ షోస్ అంటూ ఫుల్ హంగామా చేసేస్తున్నారు. ఇలా ఇప్పటికే టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలకు సంబంధించిన ఎన్నో సూపర్ హిట్స్ థియేటర్లలో మరోసారి రిలీజ్ చేశారు. ఈ ట్రెండ్ ఇప్పుడల్లా ఆగేలా కూడా లదు. ఇప్పుడు ఈ రీ రిలీజుల సినిమాల లిస్టులోకి లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ సినిమా కూడా చేరబోతోంది. ఉదయ్ కిరణ్- అనిత జటంగా నటించిన ఈ చిత్రం మరోసారి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఉదయ్ కిరణ్ సోదరి ఎమోషనల్ అయ్యారు.

లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ నటన, టాలెంట్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో గొప్ప యాక్టర్ కావాల్సింది.. మధ్యలోనే తన జీవితాన్ని ముగించేశాడు. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ ఉంటే ఎంత బాగుంటుందో కదా అని సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు అనుకుంటూనే ఉంటాడు. మరోసారి ఉదయ్ కిరణ్ స్క్రీన్ మీద చూడాలి అనే సినిమా లవర్ కోరిక ఈ మార్చి 21న తీరబోతోంది. ఉదయ్ కిరణ్ నటించిన ‘నువ్వు నేను’ సినిమా థియేటర్లలో మరోసారి సందడి చేయబోతోంది. ఈ సినిమా రీ రిలీజ్ నేపథ్యంలో ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ఎమోషనల్ అయ్యారు. అలాగే సినిమా టీమ్ కి శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా.. రీ రిలీజ్ చేస్తున్న వారికి కృతజ్ఞతలు కూడా చెప్పారు.

ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి మాట్లాడుతూ.. “ఈ నువ్వు నేను మూవీ మాకు చాలా స్పెషల్. ఈ సినిమాకి ఉదయ్ కిరణ్ కి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా దక్కింది. అంతేకాకుండా ఈ సినిమా రీ రిలీజ్ తో మనం ఎంఎస్ నారాయణ, రాళ్లపల్లి, ధర్మవరపు సుబ్రమణ్యం, ఆహుతి ప్రసాద్, వైజాగ్ ప్రసాద్, తెలంగాణ శకుంతల వంటి లెజండరీ యాక్టర్స్ కి థియేటర్లలో మరోసారి మనం ట్రిబ్యూట్ ఇచ్చేందుకు ఈ రీ రిలీజ్ వేదిక అవుతుంది. ఈ సినిమా డైరెక్టర్ తేజ, మూవీ టీమ్ కి కంగ్రాట్యులేషన్స్. అలాగే ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్న వారికి నా కృతజ్ఞతలు” అంటూ ఉదయ్ కిరణ్ సోదరి ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో నువ్వు నేను సినిమా రీ రిలీజ్ గురించే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ఉన్న ఈ రీ రిలీజుల ట్రెండ్ తో ఏర్పడిని రికార్డులను.. ఈ మూవీ కలెక్షన్స్ తో బద్దలు కొట్టేస్తుంది అంటున్నారు. ఇంకా పదిరోజుల సమయం ఉన్నా కూడా.. ఇప్పటి నుంచి నువ్వు నేను సినిమాని ఎప్పుడెప్పుడు మరోసారి థియేటర్లో చూస్తాం అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ రీ రిలీజుల ట్రెండ్ కి ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ కూడా కృతజ్ఞతలు చెబుతున్నారు. మరి.. నువ్వు నేను రీ రిలీజు సందర్భంగా ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ఎమోషనల్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet