iDreamPost
android-app
ios-app

యానిమల్ నటి లవ్‌స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు.. ఏకంగా కోహ్లీ బావతో లవ్వు!

యానిమల్ సెకండ్ హీరోయిన్ తృప్తి దిమ్రి లవ్ స్టోరీ హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లీ బావతో ప్రేమలో పడింది ఈ ముద్దుగుమ్మ. ఆ విషయాలు మీకోసం..

యానిమల్ సెకండ్ హీరోయిన్ తృప్తి దిమ్రి లవ్ స్టోరీ హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లీ బావతో ప్రేమలో పడింది ఈ ముద్దుగుమ్మ. ఆ విషయాలు మీకోసం..

యానిమల్ నటి లవ్‌స్టోరీ తెలిస్తే  షాక్ అవుతారు.. ఏకంగా కోహ్లీ బావతో లవ్వు!

అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ యానిమల్. డిసెంబర్ 01న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ రికార్డులను కొల్లగొడుతోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తోంది. అంచనాలకు తగ్గట్టుగానే యానిమల్ మూవీ అదరగొడుతోంది. ఇక ఈ సినిమాలో నటించిన రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నాల నటనకు మంచి పేరొచ్చింది. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సెకండ్ హీరోయిన్ తృప్తి దిమ్రి. యానిమల్ లో ఆమె నటించిన పాత్ర హైలెట్ గా నిలిచింది. తాజాగా తృప్తి దిమ్రి గురించి మరో విషయం వైరల్ అవుతోంది. అదేనండి ఆమె లవ్ స్టోరీ. తృప్తి దిమ్రి ఏకంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బావతో లవ్ లో పడ్డ విషయం చర్చనీయాంశంగా మారింది.

యానిమల్ మూవీతో తృప్తి దిమ్రి ఫేమస్ అయిపోయింది. తృప్తి దిమ్రి అంద చందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. యూత్ నెట్టింటా ఈ అమ్మడు గురించి తెగ వెతికేస్తున్నారు. ఇదే సమయంలో ఆమె లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తృప్తి దిమ్రి భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బావతో ప్రేమలో పడ్డారు. ఆయన మరెవరో కాదు అనుష్క శర్మ అన్న కర్నేశ్ శర్మ. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తృప్తి దిమ్రి లవ్ స్టోరీ హాట్ టాపిక్ గా మారింది.

కాగా తృప్తి నటించిన ‘బుల్‌బుల్’ సినిమాకు కర్నేశ్ శర్మ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ మూవీ చేస్తున్న సమయంలోనే తృప్తి-కర్నేశ్ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లపాటు ప్రేమలో మునిగి తేలారు. అదేంటో లవ్ లో సక్సెస్ కంటే బ్రేకప్ లే ఎక్కువ అన్నట్టు వీరి లవ్ కి కూడా బ్రేక్ పడింది. కొంత కాలం క్రితం వీరిద్దరు ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో పాటు ఫొటోల్ని కూడా డిలీట్ చేశారు. దీంతో వీరి లవ్ బ్రేకప్ అయినట్లే అని అంతా భావిస్తున్నారు. మరి తృప్తి దిమ్రి కోహ్లీ బావతో లవ్ లో ఉన్న విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet