హైపర్ ఆది.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా?: నెటిజనులు

హైపర్‌ ఆది గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మొదట్లో జబర్దస్త్‌లో ఆర్టిస్ట్‌గా వచ్చిన హైపర్‌ ఆది.. ఆ తర్వాత టీమ్‌ లీడర్‌గా ఎదిగి.. ప్రస్తుతం అనేక షోలలో కీలక పాత్ర పోషిస్తూ.. అటు సినిమాల్లో నటిస్తూ.. కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు. ఇక హైపర్‌ ఆది ముందు నుంచి మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అనే విషయం అందరికి తెలుసు. ఇక ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ మీద హైపర్‌ ఆది అతి ప్రేమ కనబరుస్తున్నాడు. సందర్భం దొరికిన ప్రతి సారి చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ల గురించి ఓ రేంజ్‌లో ఎలివేషన్స్‌ ఇస్తూ.. వేదికల మీద తన స్పీచ్‌లతో, పంచులతో మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా భోళా శంకర్‌ ప్రీ రిలిజ్‌ వేదికగా ఇలానే రెచ్చిపోయి ప్రసంగాలు చేశాడు హైపర్‌ ఆది.

హైపర్‌ ఆది వ్యాఖ్యలపై మెగా, జనసేన అభిమానులు తెగ మురిసిపోతుంటే.. సామాన్యులు మాత్రం.. హైపర్‌ ఆది అతి చేస్తున్నాడు.. ఎందుకీ భజన అంటూ విమర్శిస్తున్నారు. వేదిక మీద మెగా కుటుంబాన్ని, పవన్‌ కళ్యాణ్‌ని పొగిడావు కానీ.. మరి మేము అడిగే ప్రశ్నలుకు నీకు సమాధానాలు తెలుసా ఆది.. నీ వైఖరి చూస్తే.. అమాయకుడివో.. మూర్ఖుడివో అర్థం కావడం లేదు అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఆది ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

అసలు అంబటిని కెలికింది ఎవరు..

హైపర్‌ తన ప్రసంగంలో మాట్లాడుతూ.. ఎలక్షన్స్‌ గురించి మాట్లాడాల్సిన మంత్రులు సినిమా కలెక్షన్ల గురించి చెబుతున్నారంటూ ఇండైరెక్ట్‌గా మంత్రి అంబటి మీద సెటైర్లు వేశాడు. అయితే అసలు ఈ వివాదాన్ని ప్రారంభించింది ఎవరు.. ఇందులోకి ఆయనని లాగింది ఎవరో నీకు తెలియదా ఆది అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. గౌరవనీయులైన ఓ ప్రజాప్రతినిధి గురించి మీ నాయకుడు, అభిమాన హీరో సినిమాల్లో ఇష్టం వచ్చినట్లుగా పిచ్చి పిచ్చిగా చూపుతారు.

ఇదేంటని ప్రశ్నిస్తే.. మిమ్మల్ని ఏదో కావాలని టార్గెట్‌ చేసినట్లు బిల్డప్‌ ఇస్తారు. ముందు మీరు కుదరుగా ఉండి.. ఎదుటి వారిని గౌరివించి.. ఆ తర్వాత నీతి సూక్తులు చెప్తే బాగుటుంది అంటూ ఆదిపై సెటర్లు వేస్తున్నారు నెటిజనులు. లెక్కల గురించి ఇంతలా గింజుకుంటున్నారు.. మీరు నిజాయతీపరులే అయితే.. ఎందుకు ఇంకా అంబటి అడిగిన లెక్కలు బయట పెట్టడం లేదు అని ప్రశ్నిస్తున్నారు నెటిజనులు.

నెగిటివ్‌ వార్తలు రాయకూడదా..

రాజకీయాలు, సినిమా సెలబ్రిటీలు అన్నప్పుడు వారిని అభిమానించే వారు ఉన్నట్లే.. విమర్శించే వారు కూడా ఉంటారు. మీరేదో దైవాశంసంభూతులు అన్నట్లు ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశంసించాలి.. మీకు భజన చేయాలంటే ఎలా. సినిమాల సంగతి పక్కకు పెడితే.. రాజకీయాల్లో ఉన్నప్పుడు.. విమర్శించే వాళ్లే ఎక్కువ ఉంటారు. అన్నింటిని స్వీకరిస్తూ.. మనలోని లోపాలను సరి చేసుకుంటూ ముందుకు సాగాలి. అంతేతప్ప.. అసలు మా నాయకుడిని విమర్శించనే కూడదు అంటే ఎలా.. అలాంటి వైఖరి ఉంటే అసలు రాజకీయాల్లో రాణించలేరు అని  సూచిస్తున్నారు నెటిజనులు.

పవన్‌ పార్టీ పెట్టి 11 ఏళ్లు గడుస్తున్నా.. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు.. అసలు పార్టీ విధనాలు ఏంటో.. ఆయనకే సరిగా తెలియదు. మైక్‌ల ముందు ఆవేశం తప్పితే ఆచరణ శూన్యం. పోనీ సినిమాల్లో ఏవైనా గొప్పగా రాణిస్తున్నాడా అంటే అది లేదు. ఆయనలోని లోపాలను ప్రస్తావిస్తే అవి నెగిటివ్‌ వార్తలు అవుతాయా.. మీడియా వాళ్లని కూర్చి తీసుకుని కొడతావా.. అంటే మిమ్మల్ని పొగిడితే గొప్ప.. విమర్శిస్తే.. వాళ్లు మాత్రం తప్పుడు వార్తలు రాసినట్లా. అదే పవన్‌ అభిమానులు, జనసైనికులు చేసే ట్రోలింగ్‌ గురించి మాత్రం మాట్లడవు.. ఇదెక్కడి న్యాయం ఆది అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజనులు.

ఆర్జీవీకి అర్హత లేదు సరే.. మరి నీకేం అర్హత ఉంది

రామ్‌గోపాల్‌ వర్మ ఎంత పెద్ద దర్శకుడో.. ఆయన ఎలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీశాడో అందరికి తెలుసు. నేటి పాన్‌ ఇండియా సినిమాల కన్న.. ఎన్నో ఏళ్ల ముందే.. బాలీవుడ్‌ని తన టాలెంట్‌తో షేక్‌ చేశాడు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ఇక్కడ ఎవరు ఎలాంటి వారో తెలియదంటావా ఆది. అసలు ఆర్జీవీ సినిమాల్లోకి వచ్చే నాటికి నీ వయసు ఎంత ఉంటుంది అంటావ్‌. మరి అంత అనుభవం ఉన్న ఆర్జీవికి రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదంటున్నావ్‌.. మరి నీకేం అర్హత ఉందని మాట్లాడుతున్నావ్‌.. అది కూడా సినిమా ఫంక్షన్లలో. నీ తిప్పలన్ని ఎమ్మెల్యే సీటు కోసం అని ఐదేళ్ల బుడ్డొడిని అడిగినా చెప్తారు. నీ వ్యూహం మరీ చీప్‌గా లేదు ఆది.. అంటూ హైపర్‌ ఆదిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజనులు.

Show comments