iDreamPost
android-app
ios-app

మహేశ్- త్రివిక్రమ్ కాంబోలో పాన్ ఇండియా సినిమా!

  • Published Jan 30, 2024 | 9:31 PM Updated Updated Jan 30, 2024 | 9:31 PM

Trivikram- Mahesh Babu Pan India Movie: త్రివిక్రమ్- మహేశ్ బాబు కాంబో మరోసారి రిపీట్ కాబోతోందని తెలుస్తోంది. మరి.. ఆ వార్తలో నిజమెంతో చూడండి.

Trivikram- Mahesh Babu Pan India Movie: త్రివిక్రమ్- మహేశ్ బాబు కాంబో మరోసారి రిపీట్ కాబోతోందని తెలుస్తోంది. మరి.. ఆ వార్తలో నిజమెంతో చూడండి.

  • Published Jan 30, 2024 | 9:31 PMUpdated Jan 30, 2024 | 9:31 PM
మహేశ్- త్రివిక్రమ్ కాంబోలో పాన్ ఇండియా సినిమా!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్- సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబో ఎంతో స్పెషల్ గా ఉంటుంది. త్రివిక్రమ్ డైలాగ్స్ ను మహేశ్ చెప్తుంటే ఉండే ఫీల్ చాలా హైలో ఉంటుంది. ఇప్పటికీ వీళ్లిద్దరూ కలిసి ఏకంగా మూడు సినిమాలు చేశారు. అతడు, ఖలేజా సినిమాలు ఇప్పటికీ కల్ట్ క్లాసిక్స్ అనే చెప్పాలి. తాజాగా వచ్చిన గుంటూరు కారం కూడా కమర్షియల్ గా గట్టిగానే వర్కౌట్ అయ్యింది. ఎన్ని చెప్పుకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం కూసుల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత బయట త్రివిక్రమ్ గురించి చాలానే వార్తలు వచ్చాయి. దూరంగా ఉంటున్నాడని, కలవడం లేదంటూ చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తే వాటికి పుల్ స్టాప్ పెట్టినట్లు అయ్యింది. ఈ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది అంటూ గట్టిగానే వార్తలు వస్తున్నాయి.

త్రివిక్రమ్- మహేశ్ కాంబో చాలా స్పెషల్ గా ఉంటుంది. మాటల మాంత్రికుడి డైలాగులు, మహేశ్ మేనరిజం సరిగ్గా సెట్ అవుతాయి. తాజాగా గుంటూరు కారం సినిమాతో కూడా అది మరోసారి రుజువైంది. వీళ్ల కాంబోని ఫ్యాన్స్ ఎంతలా ఎంజాయ్ చేస్తారో చూశాం. అలాంటిది గుంటూరు కారం తర్వాత వీళ్ల టర్మ్స్ చెడిపోయాయంటూ చాలానే పుకార్లు వచ్చాయి. దూరంగా ఉంటున్నారని.. సినిమా తర్వాత పరిస్థితులు మారిపోయాయని చాలానే చెప్పారు. కానీ, వాటన్నింటినీ తుడిచిపెట్టేస్తూ కొత్తగా టాలీవుడ్ లో ఒక వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. త్రివిక్రమ్- మహేశ్ బాబు కాంబో మరోసారి రిపీట్ అవుతుందని గట్టిగానే బజ్ ఏర్పడింది.

ఆ కాంబో కూడా ఈసారి టాలీవుడ్ వరకే కాదు.. ఏకంగా పాన్ ఇండియా లెవల్లో వీళ్ల సినిమా ఉండబోతోందని చెబుతున్నారు. అది కూడా మహేశ్ బాబు స్వయంగా త్రివిక్రమ్ కు మాటిచ్చాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ తో కలిసి పాన్ ఇండియా సినిమా చేస్తానని చెప్పారంట. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ వార్తపై చర్చ జరగడం మాత్రమే కాకుండా.. రూమర్స్ కి చెక్ పెట్టినట్లు అయ్యింది. త్రివిక్రమ్ కూడా ఎప్పటి నుంచో పాన్ ఇండియా సినిమా తీసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ తో ఆ కల తీర్చుకోవాలని భావించారు. కానీ, అది ఇప్పుడల్లా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ కోసం బోయపాటి, అట్లీ కుమార్ క్యూలో ఉన్నారు. బోయపాటి ఇప్పటికే అల్లు కాంపౌండ్ నుంచి సినిమా ఓకే చేయించుకున్నాడు. కాబట్టి బన్నీ దొరికే ఛాన్స్ చాలా తక్కువనే చెప్పాలి. ఆ దెబ్బతో త్రివిక్రమ్ పాన్ ఇండియా కోరిక ఇంకాస్త వెనక్కు వెళ్లింది.

మహేశ్ బాబు ప్రామిస్ చేసినా కూడా అది పట్టాలు ఎక్కాలంటే ఇంకో మూడేళ్లు అయినా పడుతుంది. ఎందుకంటే మహేశ్ ప్రస్తుతం రాజమౌళి కోసం దాదాపు మూడేళ్లు డేట్స్ లాక్ చేసేందుకు రెడీ అయిపోయాడు. కాబట్టి మహేశ్ ఓకే చెప్పినా కూడా త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా పట్టాలెక్కాలంటే ఆలస్యం అవ్వక తప్పదు. ఈలోపు త్రివిక్రమ్ కూడా ఓ మల్టీ స్టారర్ తెరకెక్కించే పనిలో పడ్డారని చెబుతున్నారు. న్యాచురల్ స్టార్- వెంకటేశ్ కాంబోలో త్రివిక్రమ్ మూవీ ఉండబోతోంది అని చెబుతున్నారు. ఇప్పటికే నాని కూడా ఓకే చెప్పాడని టాక్ ఉంది. మరి.. త్రివిక్రమ్ తన పాన్ ఇండియా సినిమాని ఏ హీరోతో? ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి.. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో పాన్ ఇండియా సినిమా వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss