iDreamPost
android-app
ios-app

విశ్వంభరలో త్రిష కోసం అనుష్కని తప్పించారా? పెద్ద ప్లాన్ జరిగింది!

  • Published Feb 09, 2024 | 4:47 PM Updated Updated Feb 09, 2024 | 4:47 PM

Trisha In Anushka Place: విశ్వంభరలో త్రిషకి అవకాశం రావడం వెనుక చాలానే విషయం జరిగిందని చెబుతున్నారు. అనుష్కను కావాలనే పక్కన పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Trisha In Anushka Place: విశ్వంభరలో త్రిషకి అవకాశం రావడం వెనుక చాలానే విషయం జరిగిందని చెబుతున్నారు. అనుష్కను కావాలనే పక్కన పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.

  • Published Feb 09, 2024 | 4:47 PMUpdated Feb 09, 2024 | 4:47 PM
విశ్వంభరలో త్రిష కోసం అనుష్కని తప్పించారా? పెద్ద ప్లాన్ జరిగింది!

అనుష్క.. ఒకప్పుడు స్టార్ హీరోల కలెక్షన్స్ సింగిల్ హ్యాండ్ తో కొట్టిన లేడీ సూపర్ స్టార్. అరుంధతి, భాగమతి వంటి చిత్రాలతో ఇండస్ట్రీ అంతా షేక్ అయిపోయింది. ఇక బాహుబలిలో అనుష్క కష్టం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా గతం. మరి.. ఇప్పుడు స్వీటీ పరిస్థితి ఏంటి అంటే.. ఓ పెద్ద క్వశ్చన్ మార్క్! అలా అని.. ఈ బ్యూటీ చేతిలో సినిమాలు లేవని కాదు. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైనప్ లోకి రావడం లేదు. ఇంత బ్యాడ్ టైమ్ లో కూడా అనుష్క నుండి మెగాస్టార్ విశ్వంభరా మిస్ అయ్యింది. దీంతో.. అనుష్కని యూవీ బ్యానర్ పక్కన పెట్టేసింది అన్న టాక్ పుట్టుకొచ్చింది.

విశ్వంభరలో ముందుగా అనుకుంది  అనుష్కనే. కానీ.., అందరికీ షాక్ ఇస్తూ త్రిష వచ్చి చేరింది. గతంలో చిరు- త్రిష కలిసి స్టాలిన్ మూవీలో నటించారు. ఆ మూవీ వచ్చి ఇప్పటికి 18 సంవత్సరాలు అయ్యింది. అయినా.., త్రిషని ఎందుకు రిపీట్ చేశారు. ఇది సమాధానం లేని ప్రశ్న. అనుష్కని తప్పించడానికి మాత్రమే త్రిషని తెరపై తెచ్చారు అన్నది కొందరి వాదన. కానీ.., యూవీ బ్యానర్ కి బొమ్మాలి చాలా స్పెషల్. మొన్నటికి మొన్న “మిస్ శెట్టి.. మిస్ట‌ర్ పొలిశెట్టి”తో సీనియర్ హీరోయిన్ ని రీ-లాంచ్ చేసింది కూడా వీరే. ఇంత బాండింగ్ ఉన్న వీరి మధ్య విబేధాలు ఉంటాయా? చిరుకి జోడీగా అనుష్కని తప్పించడానికి కారణం వేరే ఉందట.

“మిస్ శెట్టి..మిస్ట‌ర్ పొలిశెట్టి”  కచ్చితంగా అనుష్క కోసం తీసిన సినిమానే, కానీ.., రిజల్ట్ తేడా కొట్టేసింది. ఇప్పుడు మళ్ళీ విశ్వంభరలో ఇరికిస్తే అనుష్క మామూలు హీరోయిన్ గా సరిపెట్టుకోవాల్సి వస్తది. ఇది యూవీ మేకర్స్ కి అస్సలు ఇష్టం లేదట. మన జేజమ్మ రేంజ్ కి తగ్గట్టు ఒక భారీ లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నారట. బడ్జెట్ కూడా ఎక్కువే. వర్క్ అవుట్ అయితే అనుష్క ఎంత అద్భుతం చేయగలదో అందరికీ తెలుసు. ఇదే ఇప్పుడు యూవీ వాళ్ళ దైర్యం. పైగా.. అనుష్క వాళ్ళ సొంత మనిషి. అంత స్వచ్ఛమైన బాండింగ్ వాళ్ళది. కాబట్టే.. విశ్వంభర నుండి తప్పించారని టాక్. మరి.. అనుష్క ఆ లేడీ ఓరియెంటెడ్ మూవీతో మునుపటి మ్యాజిక్ రిపీట్ చేస్తుందా? చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss