iDreamPost
android-app
ios-app

Tripti Dimri: స్టార్ హీరోల ఇంటి పక్కనే  ఖరీదైన బంగ్లా కొన్న యానిమల్ బ్యూటీ! ధరెంతో తెలిస్తే షాకే..

  • Published Jun 08, 2024 | 1:37 PM Updated Updated Jun 08, 2024 | 1:37 PM

స్టార్ హీరోల ఇంటి పక్కనే యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇంటి ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..

స్టార్ హీరోల ఇంటి పక్కనే యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇంటి ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jun 08, 2024 | 1:37 PMUpdated Jun 08, 2024 | 1:37 PM
Tripti Dimri: స్టార్ హీరోల ఇంటి పక్కనే  ఖరీదైన బంగ్లా కొన్న యానిమల్ బ్యూటీ! ధరెంతో తెలిస్తే షాకే..

త్రిప్తి దిమ్రి.. యానిమల్ మూవీతో యూత్ క్రష్ గా మారిపోయింది. ఈ చిత్రంలో తన నటన, అందంతో పాన్ ఇండియా లెవల్లో అభిమానులను సంపాదించుకుంది. అయితే యానిమల్ కు ముందు చాలా చిత్రాల్లోనే కనిపించిన త్రిప్తికి ఊహించని క్రేజ్ తెచ్చింది మాత్రం రణ్ బీర్ కపూర్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ తోనే. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ కొత్తిల్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల ఇంటిపక్కనే ఈ బ్యూటీ ఇల్లు కొనడం విశేషం. ఇంతకీ ఆ ఇంటి ధరెంతో తెలుసా? తెలిస్తే వామ్మో అనాల్సిందే.

బాంద్రా.. ముంబైలోని అంత్యంత ఖరీదైన, సెలబ్రిటీల నిలయంగా పేరొందిన ప్రాంతం. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు అక్కడ విలాసవంతమైన, లగ్జరీ హౌస్ లు, విల్లాలు ఉన్నాయి. తాజాగా బాంద్రాలోకి అడుగుపెట్టింది యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి. బాంద్రాలో 247 గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు అంతస్థుల భవనాన్ని ఆమె కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర అక్షరాలా రూ. 14 కోట్లు అని టాక్. ఈ ఇంటికి సంబంధించి స్టాంప్ డ్యూటీ కింద రూ. 70 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 30 వేలు కూడా చెల్లించింద త్రిప్తి.

కాగా.. త్రిప్తి ఉండే ఏరియాలోనే బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్ బీర్ కపూర్-ఆలియా భట్ లాంటి ఎంతో మంది సెలబ్రిటీలు ఇక్కడే నివాసం ఉంటున్నారు. త్వరలోనే ఇక్కడికి మకాం మర్చానుందని సమాచారం. ఇక త్రిప్తి కెరీర్ విషయానికి వస్తే.. మామ్, పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను లాంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆమె కెరీర్ మలుపు తిరిగింది మాత్రం ‘బుల్ బుల్’ మూవీతోనే అని చెప్పాలి. కాలా చిత్రంతో ఆ క్రేజ్ మరింత పెరగ్గా.. ఆ క్రేజ్ పీక్స్ కు వెళ్లింది మాత్రం యానిమల్ తోనే అని చెప్పక తప్పదు. ఇక ప్రస్తుతం ‘విక్కీ విద్యా కో వాలా వీడియో’ చిత్రంతో పాటుగా భూల్ భులయా 3, ధడక్ 2, బ్యాడ్ న్యూస్ చిత్రాల్లో నటిస్తోంది. మరి స్టార్ హీరోల ఇంటి పక్కనే త్రిప్తి ఇల్లు కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio