iDreamPost

డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్న త్రినయని సీరియల్ నటి!

  • Author Soma Sekhar Published - 04:55 PM, Mon - 10 July 23
  • Author Soma Sekhar Published - 04:55 PM, Mon - 10 July 23
డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్న త్రినయని సీరియల్ నటి!

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోయిన్, డైరెక్టర్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణమే. ఇప్పటికే మనం ఇండస్ట్రీలో ఇలాంటి పెళ్లిళ్లు ఎన్నో చూశాం. తాజాగా మరో ప్రేమ పెళ్లి పరిశ్రమలో జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ నటి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఎలాంటి హంగూ.. ఆర్భాటం లేకుండా జూలై 9న ఎంతో సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు సదరు డైరెక్టర్, సీరియల్ నటి. మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ డైరెక్టర్, సీరియల్ నటి ఎవరో ఇప్పుడు చూద్దాం.

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్ళలకు కొదవలేదు. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు.. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో వస్తున్నదే. తాజాగా మరో ప్రేమ జంట మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. బెంగాలీ ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్ స్వర్ణేందు, సీరియల్ నటి శృతి కొంతకాలంగా ప్రేమలో ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరు మూడుముళ్లతో ఒక్కటైయ్యారు. జూలై 9న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని శృతి మీడియాకు వెల్లడించింది. కొంతకాలంగా మేం కలిసే ఉంటున్నామని, సరైన సమయంలో వివాహ బంధంతో ఒక్కటైయ్యామని శృతి తెలిపింది.

ఇక వారి రిసెప్షన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. కాగా.. బుల్లితెర సీరియల్స్ కు దర్శకత్వం వహిస్తాడు స్వర్ణేందు. ఈ క్రమంలోనే త్రినయని సీరియల్ సమయంలో శృతిని కలిశాడు. త్రినయని సీరియల్ తోనే శృతి బుల్లితెరకు పరిచయం అయ్యింది. ఇక ఈ సీరియల్ తెరకెక్కుతున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మూడు ముళ్లతో ఒక్కటైన ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Poulami Sengupta (@itsmepoulami_sg)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి