iDreamPost

ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోతున్నాను..పవిత్రపై త్రినయని హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

  • Published May 14, 2024 | 3:43 PMUpdated May 14, 2024 | 3:43 PM

బుల్లితెర నటి పవిత్ర జయరామ్ కారు యాక్సిడెంట్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, ఆమె హఠాన్మరణం పై త్రినయని సీరియల్ హీరోయిన్ ఆషికా పదుకొణె రియాక్ట్ అయింది. ఈ సందర్భంగా ఆమెను తలుచుకుంటూ ఓ పోస్ట్‌ ను షేర్‌ చేసింది.

బుల్లితెర నటి పవిత్ర జయరామ్ కారు యాక్సిడెంట్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, ఆమె హఠాన్మరణం పై త్రినయని సీరియల్ హీరోయిన్ ఆషికా పదుకొణె రియాక్ట్ అయింది. ఈ సందర్భంగా ఆమెను తలుచుకుంటూ ఓ పోస్ట్‌ ను షేర్‌ చేసింది.

  • Published May 14, 2024 | 3:43 PMUpdated May 14, 2024 | 3:43 PM
ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోతున్నాను..పవిత్రపై త్రినయని హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ కన్నడ నటి పవిత‍్ర జయరామ్‌ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఆమె అకాల మరణం ఆమె కుటుంబానికి, సినీ పరిశ్రమ వర‍్గాలను, తోటి నటీ నటులను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాగే పవిత్ర మరణం తర్వాత.. ఆమెకు సంబంధించి రోజుకొక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా పవిత్ర మరణం పై త్రినయని సీరియల్ హీరోయిన్ ఆషికా పదుకొణె రియాక్ట్ అయింది. తనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ త‍్రీవ భావోద్వేగానికి గురయ్యి సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

బుల్లితెర నటి పవిత్ర జయరామ్ కారు యాక్సిడెంట్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, ఆమె జీ తెలుగులో ప్రసారమయ్యే ‘త్రినయని’ సీరియల్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది పవిత్ర. ఇక సీరియల్‌ లో తిలోత్తమగా తనదైన నటనతో మెప్పించింది. కానీ, అలాంటి నటి యాక్సిడెంట్‌లో హఠాన్మరణం చెందడంతో.. తాజాగా ఆమె మృతిపై త్రినయని సీరియల్ హీరోయిన్ ఆషికా పదుకొణె రియాక్ట్ అయింది. ఈ సందర్భంగా ఆమెను తలుచుకుంటూ ఓ పోస్ట్‌ ను షేర్‌ చేసింది.

కాగా, ఆ పోస్ట్‌ లో.. పవిత్ర ఇక లేదని తెలిసి నా గుండె బద్దలైపోయింది.త్రినయని సీరియల్‌లో తిలోత్తమగా పవిత్ర నటన ఎప్పటికీ మర్చిపోలేం. షూటింగ్ సెట్‌లో ఆమె ఎనర్జీని ఎవరూ మ్యాచ్ చేయలేరు. ముఖ్యంగా సీరియల్‌లో మా ఇద్దరి మధ్య నడిచే టగ్ ఆఫ్ వార్ సీన్లు అంటే పవిత్రకి చాలా ఇష్టం. అసలు ఆ జ్ఞాపకాల నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. రేపు నువ్వు లేని సెట్‌లోకి అడుగుపెట్టడం చాలా కష్టం. నీ హగ్, నువ్వు చెప్పే గుడ్ మార్నింగ్, నీతో కలిసి భోజనం చేసే టైమ్ ఇవన్నీ మేము చాలా మిస్ అవుతాం. ఇక ఈ నాలుగేళ్లలో నీతో పాటు ఆడుతూపాడుతూ మేము ఎన్నో మధుర క్షణాలు గడిపాం. అలాంటి క్షణాలు ఇక లేవని గుర్తొచ్చిన ప్రతిసారి చాలా కష్టంగా ఉంది. నీ స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యం.

ఇక ఎప్పట్టికీ నువ్వు మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతావు. నీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఒక్కసారి మా కోసం తిరిగిరా ప్లీజ్.” అంటూ ఆషికా పదుకొణె ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా.. సీరియల్‌లో తిలోత్తమను మిస్ అవుతాం అంటూ బాధపడుతున్నారు. మరి, పవిత్ర మృతి పై ఆషికా పోస్ట్‌ చేసిన ఆ పోస్ట్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ashika Gopal (@ashikapadukone_official)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి